సెలబ్రిటీలకు అలియా మంచి సందేశం ఇచ్చారు... షారుక్ కూతురు కామెంట్స్ వైరల్?

బాలీవుడ్ బాద్షా నటుడు షారుక్ ఖాన్ ( Shahrukh Khan ) కుమార్తే సుహానా ఖాన్( Suhana Khan ) ఇండస్ట్రీలోకి రావడానికి సిద్ధమవుతున్నారు ఇప్పటికే ఒక షార్ట్ ఫిలిం లో నటించిన సుహానా ఖాన్ త్వరలోనే వెండి తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు.

ఈమె ఇప్పుడు ది ఆర్చీస్’( The Archies ) అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈ సినిమా టీనేజ్ మ్యూజికల్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందింది.ఇక ఈ సినిమా డిసెంబర్ 7న రిలీజ్ కి సిద్ధవుతుంది.

అయితే ఈ మూవీ థియేటర్ లో కాకుండా ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ లో విడుదల కానుంది.ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో సుహానా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె అలియా భట్( Alia Bhatt ) గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అలియాభట్ ఇటీవల నేషనల్ అవార్డు ( National Awards ) అందుకున్న సంగతి మనకు తెలిసిందే.ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ నేషనల్ అవార్డు అందుకునే సమయంలో ఆలియా భట్ తన పెళ్లి చీర ( Wedding Saree ) ధరించి వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఆ సమయంలో రీ యూజ్ ( Re Use ) అంటూ ఎంతో మంది ఎన్నో రకాల పోస్టులు చేశారు.

Advertisement

అయితే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెలెబ్రెటీలందరూ కూడా ఒకసారి ధరించడం దుస్తులను మరొకసారి ధరించడానికి ఇష్టపడరని సుహాన తెలిపారు అయితే ఈ పద్ధతికి అలియా భట్ బ్రేక్ వేశారని తెలిపారు.

ఇలా ఆలియా భట్ ఒక అడుగు ముందుకు వేసి రీ యూస్ అనే సందేశాన్ని అందరికీ చేరవేశారు ఇది చాలా మంచి సందేశం అని సుహానా ఖాన్ తెలిపారు.ఇక్కడ చాలామంది సెలబ్రిటీస్.ఒకరి కోసం ఒకరు వన్ టైం యూజ్ అనే పద్ధతి ఫాలో అవుతున్నవారే ఎక్కువ.

ఈ పద్ధతిని బ్రేక్ చేయడానికి అలియా మొదటి అడుగు తీసుకున్నారు.ఇలా అలియా భట్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం సెలబ్రిటీలందరికీ ఒక మంచి సందేశం అని రీ యూస్ అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఎంతో అవసరమని, పర్యావరణ పరిరక్షణకు కూడా ఈ పద్ధతి ఎంతో అవసరం అంటూ ఈమె చేస్తున్నటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు