బాలీవుడ్ కింగ్ ఖాన్ ప్రెసెంట్ వరుస సినిమాలతో దూసుకు పోతున్నాడు.అయితే షారుఖ్ ఖాన్ విజయం సాధించి చాలా కాలం అవుతుంది.
దీంతో సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు.అందుకే ఈసారి షారుఖ్ గట్టిగా కొట్టాలని ఫిక్స్ అయినట్టు కనిపిస్తుంది.
అందుకే ఒకదానికి మించి మరొక సినిమాను ప్రకటిస్తున్నాడు.ఇక ప్రెసెంట్ ఈయన నటిస్తున్న సినిమాల్లో పఠాన్ ఒకటి.
యాక్షన్ ఇంటెర్త్తైనర్ గా భారీ స్థాయిలో ఈ సినిమాను రూపొందించారు.బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ప్రముఖ నిర్మాణ సంస్థ అయినా యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు.అయితే ఈ సినిమాపై తాజాగా ఒక సాలిడ్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు.
షారుఖ్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా బ్లాస్టింగ్ అనౌన్స్ మెంట్ ఇచ్చేయగా ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు.తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను సాలిడ్ పోస్టర్ తో ప్రకటించారు.
ఈ సినిమాను వచ్చే ఏడాది 2023 జనవరి 25న రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసారు.
అలాగే హిందీలో మాత్రమే కాకుండా తమిళ్, తెలుగులో కూడా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు బిగ్ అనౌన్స్ మెంట్ చేయడంతో ఈ పోస్ట్ ఇప్పుడు ఆసక్తిగా మారింది.ఈ పోస్టర్ లో షారుఖ్ ఖాన్ కొత్త లుక్ లో ఆకట్టు కుంటున్నాడు.దీపికా పదుకొనే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా జాన్ అబ్రహం కీలక పాత్ర పోషిస్తున్నాడు.
ఇక ఈ సినిమాతో పాటు ఇంకొన్ని సినిమాలను కూడా లైన్లో పెట్టి వేగంగా షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నాడు.కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో నయనతార బాలీవుడ్ లోకి అడుగు పెడుతుంది.అలాగే దీపికా పదుకొనే కూడా ఈ సినిమాలో అతిథి పాత్రలో మెరవనుంది.