ఎంత గొప్ప నటుడైన సరే గొప్ప పాత్రలు పడితేనే గొప్పగా నటించగలరు.ఆలా గొప్ప పాత్రలు పడాలంటే గొప్ప కథ ఉండాలి.
అలాగే కథలని కథనాన్ని అర్ధం చేసుకోగలగాలి.లేదంటే ఎంత పెద్ద స్టార్ అయినా ఇంట్లో ఖాళీగా కూర్చోవాల్సిందే.
అందుకే కథకు నటుడు గౌరవం ఇవ్వాలి.ఇక కొన్ని సార్లు ఈ పరిస్థితి ఉండదు.
మనం ఎంత బాగా నటిస్తున్నాం అనేదానికన్నా కూడా ఆ పాత్రకు తగ్గట్టుగా నటిస్తున్నామా లేదా అనేది కూడా చాల ముఖ్యం.అందుకే నటుడు అనేవాడు జీవితం మొత్తం నేర్చుకుంటూనే ఉండాలి.
లేదంటే అతడి జీవితం అక్కడే ఆగిపోతుంది.సినిమాలో లెన్తీ రోల్ నటించడం ముఖ్యం కాదు కథలో ముఖ్యమైన పాత్రలో ఉన్నామా లేదా అనేది మాత్రమే అవసరం.
ఒక్కోసారి జోనర్ ని బట్టి కథ, మరియు పాత్రలు బిన్నంగా నటించాల్సి వస్తుంది.చిన్నతనం నుంచి కాలు కింద పెట్టకుండా పెరిగిన అమ్మాయిలను హీరోయిన్స్ గా ఎంచుకొని పల్లెటూరు పాత్రలో పరమ నాటుగా చేయమంటే అలవోకగా చేయాలంటే అంత ఈజీ కాదు.
కొన్ని సార్లు మనం ఎమోషనల్ సీన్స్ లో నటించాలంటే అవి తెలియచేయడానికి గట్టిగా మాట్లాడటం లేదా ఏడవటం వంటివి చేస్తూ ఉంటాం.కానీ కళ్ళలో పలికించే భావాలతో , లోపల అణుచుకున్న బాధలకు సంబందించిన స్పందనను చెప్పడం కూడా ఒక మంచి వ్యక్తీకరణే అవుతుంది.
అప్పుడే ఆ పాత్ర ఎలా నటిస్తుందో జీవిస్తుందో చూసే ప్రేక్షుకుడికి అర్ధం అవుతుంది.

ఒక్క ఉదాహరణ చెప్పాలంటే 1974 విడుదల అయినా అంకుర్ సినిమా చేస్తున్నప్పుడు షబానా అజ్మీ వయసు కేవలం 23.ఆ రోజు వరకు ఆమె పెల్లెటూరు మొహం చూసి కూడా ఉండదు.సినిమా షూటింగ్ మొదలు పెట్టిన రోజు ఒక నేత చీర ఇచ్చి ఆమెను కట్టుకొమ్మని చెప్పారట.
నడవడం వరకు బాగానే ఉంది కానీ కూర్చోవడం వంటివి ఇబ్బందిగా అనిపించిందట.ఆ సినిమాకు దర్శకుడు శ్యాం బెనగల్. కింద కూర్చొని ఏదైనా పని చేయాలంటే ఇబ్బంది గా అనిపించింది.ఇక శ్యాం బెనగల్ షబానా దగ్గరికి వచ్చి ఈ రోజు నువ్వు డైనింగ్ టేబుల్ మీద కాకుండా మాతో పాటు కింద కూర్చొని భోజనం చేయమని అడిగారట.
ఆమె చాల ఇబ్బంది పడుతూ అలాగే కూర్చుంది.

ఇక సినిమా షూటింగ్ చూడటానికి, హీరోయిన్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి అక్కడికి చాల మంది స్టూడెంట్స్ వచ్చారట.వారు అంత హీరోయిన్ కోసం ఎదురు చూస్తుండగా షబానా వచ్చారట.ఎవరు నువ్వు ? హీరోయిన్ ఎక్కడ అని అడిగారట.దాంతో హీరోయిన్ వెళ్ళిపోయింది నేను ఈ సినీమియాలో ఆయా పాత్ర చేశునన్ను అని చెప్పింది.శ్యాం బెనగల్ అది చూసి నువు ఈ రోజు నిజంగా హీరోయిన్ అనిపించుకున్నావ్ అంటూ పొగిడారట.
అది అసలు విషయం.పాత్రను బట్టి మనిషి మారాల్సిందే.







