సముద్రపు లోతుల్లో బయటపడ్డ 7 వేల ఏళ్ల నాటి రోడ్డు.. దాని విశేషాలు ఇవే..

క్రొయేషియా యూనివర్శిటీ ఆఫ్ జాదర్‌కు చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు( Archaeologists ) మధ్యధరా సముద్రపు లోతుల్లో 7 వేల సంవత్సరాల నాటి పురాతన రహదారిని కనుగొన్నారు.ఈ రహదారి మట్టి పొరల క్రింద కనిపించింది.

 Seven Thousand Year Old Road Discovered Under Mediterranean Sea Details, Archaeo-TeluguStop.com

ఈ రోడ్డు ప్రస్తుతం మునిగిపోయిన హ్వార్ సంస్కృతి స్థావరాన్ని( Hvar Culture ) కోర్కులా ద్వీపంతో కనెక్ట్ చేసి ఉండి ఉండొచ్చని తెలుస్తోంది.ఈ పాత రోడ్డును జాగ్రత్తగా ఉంచిన రాతి పలకలతో నిర్మించినట్లు శాస్త్రవేత్తలు అర్థం చేసుకున్నారు.

నాలుగు మీటర్ల వెడల్పు గల ఈ రోడ్డు ఇప్పటికీ చక్కగానే ఉండటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది.హ్వార్ ప్రజలు సుమారు క్రీస్తుపూర్వం 5 వేల ఏళ్ల క్రితం ఇదే ప్రదేశంలో నివసించారు.

తీరం వెంబడి, సమీపంలోని ద్వీపాలలో రైతులు, పశువుల కాపరులుగా వీరు జీవనాన్ని సాగించారు.సోలిన్ సైట్ ఈ ప్రాంతంలోని అతిపెద్ద, బాగా సంరక్షించబడిన హ్వార్ ప్రజల నివాస స్థలాలలో ఒకటి.

Telugu Archaeology, Croatia Zadar, Hvar, Road, Soline Site, Stone Age Road, Terr

సోలిన్ సైట్( Soline site ) ద్వీపంలోని నిటారుగా, రాతితో కూడిన భూభాగాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వీలుగా ఒక టెర్రస్డ్ ఫీల్డ్‌ల సిస్టమ్‌ను కూడా ప్రజలు ఏర్పరుచుకున్నారు.ఈ పొలాలకు రాతి గోడలు, నీటిపారుదల మార్గాలు కూడా ఉన్నాయి.ఇవి భూమి ఉత్పాదకతను పెంచడానికి సహాయపడతాయి.ఫ్లింట్ బ్లేడ్‌లు, రాతి గొడ్డలి, మిల్లు రాళ్ల శకలాలు వంటి నియోలిథిక్ కళాఖండాలు కూడా ఈ ప్రదేశంలో కనుగొనబడ్డాయి.

Telugu Archaeology, Croatia Zadar, Hvar, Road, Soline Site, Stone Age Road, Terr

సోలిన్ సైట్ ఇంకా పూర్తిగా తవ్వడం జరగలేదు.హ్వార్ ప్రజల జీవన విధానం గురించి చాలా వరకు తెలియదు.కోర్కులా ద్వీపంలోని వెలా లుకాలోని గ్రాడినా బే సమీపంలో భూ పరిశోధన ప్రాజెక్ట్ సందర్భంగా పరిశోధకులు ఈ రహదారిని కనుగొన్నారు.ప్రజలు 7000 ఏళ్ల క్రితం కూడా రోడ్లపై నడిచారని పరిశోధకులు తమ ఆశ్చర్యాన్ని వ్యక్తపరిస్తూ ఫేస్‌బుక్ పోస్ట్‌లో ఈ వివరాలను పంచుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube