ఒకే ఒక్క యాప్ సాయంతో రూపాయి ఖర్చు లేకుండా మీ ఫోన్లోనే సీసీ కెమెరా సెట్ చేసుకోండిలా!

ప్రపంచం డిజిటల్ మయం అయిపోయింది.మనిషిని ఇపుడు స్మార్ట్ ఫోన్స్ శాసిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు.

ఈ క్రమంలోనే పలు కంపెనీలు మార్కెట్లోకి నిత్యం కొత్త కొత్త అప్డేట్స్ కలిగిన స్మార్ట్ ఫోన్లు రిలీజు చేస్తున్నాయి.మనలో చాలా మంది 6 నెలలకు ఒక ఫోన్ మార్చేస్తూ వుంటారు.

ఎందుకంటే కొత్తకొత్త అప్డేటెడ్ ఫోన్స్ కావాలి మరి.ఇక ఈ క్రమంలో వాడేసిన పాత ఫోన్ ను పక్కకు పడేస్తూ ఉంటారు.అయితే.

పాత ఫోన్లు కూడా పనికి వస్తాయన్న విషయం చాలామందికి తెలియదు.జాగ్రత్తగా వాడితే వాటిని ఇతర అవసరాలకు ఎంచక్కా వాడుకోవచ్చు.

Advertisement

అవును, ప్రస్తుతం మనచుట్టూ దొంగతనాలు అధికమయ్యాయి.చాలామంది కేటుగాళ్లు ఈజీగా సంపాదించాలనే నెపంతో దొంగతనాలకు పాల్పడుతున్నారు.అందుకే ప్రజలు తమ ఇళ్లలో సీసీటీవీలను ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.

తద్వారా ఇంటి బయట నిఘా ఉంచొచ్చని వారి ఆలోచన.అయితే, సీసీటీవీ ఏర్పాటుకు దాదాపు రూ.10,000 నుంచి రూ.20,000 వరకు ఉంటుండడంతో వాటిని కొనుగోలు చేయడానికి కొంతమంది వెనకడుగు వేయాల్సిన పరిస్థితి.ఈ పరిస్థితిలో, మీరు ఇంట్లో ఉంచిన పాత ఫోన్‌ను సిసిటివిగా మార్చి ఉపయోగించుకోవచ్చు.

అవును, మీ పాత ఫోన్, అలాగే మీరు వాడుతున్న తాజా ఫోన్ రెండింటిలోనూ Alfred CCTV Camera డౌన్‌లోడ్ చేసుకొని పాత స్మార్ట్‌ఫోన్‌ను సీసీటీవీగా మార్చుకోవచ్చు.ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత, మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను CCTVలా మరియు ఇప్పటికే ఉన్న ఫోన్‌ను మానిటర్‌గా ఉపయోగించుకోవచ్చు.దీనికి మీరు చేయవలసిందల్లా ఒక్కటే, ఫోన్‌ను సీసీటీవీగా ఉపయోగించాలనుకుంటున్న చోట పాత ఫోన్‌ను అమర్చాలి.

ఈ ఫోన్‌ను ఇంటర్నెట్‌కు చేసెయ్యాలి.ఇక పాత ఫోన్ యొక్క బ్యాటరీ అయిపోకుండా ఉండాలంటే, మీరు దీనికి విద్యుత్ సరఫరాను ఇవ్వాల్సి ఉంటుంది లేదంటే పవర్ బ్యాంక్‌ను కనెక్ట్ చేసుకోవాలి.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు