బుల్లితెర పై విజయం సాధించిన హీరోయిన్లు వెండితెర పై తమ కెరీర్ ను ప్రారంభించి విజయం సాధించాలంటే ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి.ఇక సీరియల్ హీరోయిన్స్ కి( Serial Heroines ) సినిమాలలో ఛాన్స్ ఇవ్వడానికి చాలా మంది దర్శకనిర్మాతలు ఇంట్రెస్ట్ చూపించరు.
అయితే సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన హీరోయిన్స్ సినిమాలలో కూడా తమ సత్తా చాటుటున్నారు.ప్రతిభ ఉంటే లేట్ అయిన సినీ ఇండస్ట్రీలో రాణించడం సాధ్యమేనని ఈ హీరోయిన్స్ నిరూపిస్తున్నారు.
ఇక వీరిలో కొంతమంది హీరోయిన్స్ పెళ్లి అయిన తరువాత కూడా సక్సెస్ ఫుల్ గా కెరీర్ లో రాణిస్తున్నారు.ఈ హీరోయిన్స్ కి స్టార్ హీరోల పక్కన కూడా ఆఫర్లు వస్తుండటం విశేషం.
ఇక వీరి రెమ్యూనరేషన్స్ కూడా భారీగానే ఉంటున్నాయి.అలా బుల్లితెర నుండి వెండితెరకి వచ్చిన హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం…
కలర్స్ స్వాతి
బుల్లి తెర మీద వచ్చిన కలర్స్ అనే ప్రోగ్రాం లో యాంకర్ గా చేసిన స్వాతి ( Colors Swathi ) ఆ తర్వాత హీరోయిన్ గా మారింది…అందులో.
భాగంగానే నిఖిల్ తో స్వామి రారా,కార్తికేయ లాంటి సినిమాలు చేసి సక్సెస్ లు సాధించింది…
హన్సిక
హీరోయిన్ హన్సిక( Hansika ) తన కెరీర్ ను బుల్లితెర పై ప్రారంభించింది.తన ప్రతిభతో సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల పక్కకన నటించి, ఎన్నో హిట్ సినిమాలు చేసింది.ఇటీవలే ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుంది…
మృణాల్ ఠాకుర్

సీతారామంతో విజయంతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిన మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) కూడా బుల్లితెర నుండి సినీ ఇండస్ట్రీకి వచ్చింది.కుంకుమ భాగ్య అనే సీరియల్ లో నటించింది.ఆ తరువాత బాలీవుడ్ చిత్రాలలో హీరోయిన్ గా దూసుకెళ్తోంది…
ప్రియ భవాని శంకర్

హీరోయిన్ ప్రియా భవానీ శంకర్( Priya Bhavani Shankar ) తమిళంలో న్యూస్‌రీడర్ గా కెరీర్ ను మొదలుపెట్టారు.2017లో మేయా దమాన్ అనే కోలీవుడ్ చిత్రం ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది…
మౌనిరాయ్

మౌనీ రాయ్ మొదట టివి నటి, మోడల్.ఆమె మహదేవ్, నాగిన్ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ప్రస్తుతం బాలీవుడ్ లో రాణిస్తోంది…
వాణి బోజన్

వాణి బోజన్ మొదట టెలివిజన్ నటి, ఆమె ఉత్తమ అవార్డును కూడా అందుకుంది.వాణి బోజన్ తెలుగులో 2019లో వచ్చిన మీకు మాత్రమే చెప్తా అనే సినిమాతో పరిచయం అయ్యింది…
అవికా గోర్

ఒక ప్రముఖ టివి చానెల్ లో ప్రసారమైన చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయింది అవికా గోర్, ఆ తర్వాత విరంచి వర్మ డైరెక్టర్ గా రాజ్ తరుణ్ హీరో గా వచ్చిన మొదటి సినిమా ఉయ్యాల జంపాల ఆ సినిమాతో అవికా గోర్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మారిపోయింది…
.







