బుల్లితెర సీరియళ్లలో వరుసగా అవకాశాలను సంపాదించుకుంటూ శ్రీవాణి తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.తాజాగా శ్రీవాణి ప్రముఖ కమెడియన్ అలీ హోస్ట్ చేస్తున్న అలీతో సరదాగా షోకు హాజరై తన రియల్ లైఫ్ కు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
మరోనటి నవ్యస్వామి కూడా ఈ షోకు హాజరయ్యారు.అలీ నవ్యస్వామిని నవ్య స్క్రీన్ నేమా.? కాదా.? అని అడగగా అమ్మ నవ్య అని పెట్టిందని నామకరణం జరిగింది మాత్రం నైనా అని జరిగిందని నవ్యస్వామి చెప్పుకొచ్చారు.
అలీ ఇండస్ట్రీలో అందరినీ ఒక ఆట ఆడిస్తున్నావంటా.? అని నవ్యస్వామిని అడగగా అయ్యో.! ఇంత రాంగ్ పబ్లిసిటీ ఏంటి.? ప్లీజ్ కట్ చేయండి అని చెబుతారు.కరోనా పాజిటివ్ రావడం గురించి మాట్లాడుతూ తన లైఫ్ లో కరోనా సోకిన టైమ్ లో తనది గేటెడ్ కమ్యూనిటీ కాగా తనకు తోడు ఎవరూ లేరని తాను చాలా బాధ పడ్డానని నవ్యస్వామి అన్నారు.అలీ శ్రీవాణికి పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు వేశారు.

శ్రీవాణి తనకు 17 సంవత్సరాల వయస్సు ఉన్న సమయంలో మా ఆయన వెళ్లిపోదామని అడగగానే సీరియల్ మధ్యలో నుంచి వెళ్లిపోయానని చెప్పారు.తాను వెళ్లిపోయిన తరువాత ఆ సీరియల్ ఆగిపోయిందని శ్రీవాణి అన్నారు.తనకు నాన్న ఉన్నారని నాన్న ఉన్నా లేనట్టేనని శ్రీవాణి అన్నారు.మా నాన్న నాకు ఒక కొత్త డ్రెస్ ఎప్పుడూ తీసుకురాలేదని ఆమె తెలిపారు.నటి శ్రీవాణి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
వచ్చే మంగళవారం రాత్రి 9 : 30 గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.శ్రీవాణి ఈ షోలో తను బాల్యంలో అనుభవించిన కష్టాల గురించి చెప్పుకొచ్చారు.అలీ తన షోల ద్వారా సెలబ్రిటీల గురించి ప్రేక్షకులకు తెలియని కీలక విషయాలను తెలిసేలా చేస్తుండటం గమనార్హం.







