బుల్లితెర నటి ప్రతిభా రాంటా గురించి మనందరికీ తెలిసిందే.ఈమె జీటీవీ పాపులర్ సీరియల్ అయిన ఖుర్బాన్ హువా ద్వారా సుపరిచితమే.
ఈ సీరియల్ తో మంచి పాపులారిటీని సంపాదించుకుంది ప్రతిభా రాంటా.ఇక ఆమె తనకున్న నాట్యకళను నటనా రంగంలోకి అడుగు మోపడానికీ ఊతంగా మలుచుకొని విజయవంతం అయ్యింది.
కేవలం బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా సినిమాలలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.అదేవిధంగా వెబ్ సిరీస్ లలో కూడా నటించి తన ప్రతిభను చాటుకుంది ఈ ముద్దుగుమ్మ.
ప్రతిభా రాంటా కు సంబంధించిన మరిన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈమె సిమ్లా కు దగ్గరలో ఉన్న ధరోటీలో పుట్టి సిమ్లాలో పెరిగిందట.
ఆమె తల్లి పేరు సందేశనా రాంటా, తండ్రి పేరు రాజేష్ రాంటా.ప్రతిభాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ పై ఆసక్తి ఉండడంతో నాట్యంలో శిక్షణ తీసుకుంది.
అంతే కాకుండా ఎన్నో పోటిల్లో పాల్గొని మొదటి ప్లేస్ లో నిలిచింది.అలా సిమ్లా డాన్స్ సెంటర్ నుంచి డిగ్రీ తీసుకుని నటనారంగంలో తన సత్తాను నిరూపించుకోవడానికి ముంబైకి చేరుకొని అక్కడ ఉష ప్రవీన్ గాంధీ కాలేజ్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో ఫిలిం మేకింగ్ లో శిక్షణ తీసుకుంది.
ఆ సమయంలోనే మోడలింగ్లో అవకాశాలు రావడంతో 2018 ముంబై అందాల పోటీలో పాల్గొని కిరీటాన్ని సొంతం చేసుకుంది.
ఆ తర్వాత ఈమె కు వరుసగా అవకాశాలు వచ్చాయి.ఈ క్రమంలోనే ఆమె బిజీ బిజీగా ఉంటున్న టైములో ఖుర్బాన్ హువా సీరియల్ లో ప్రధాన పాత్రలో అలరించింది.ఈ సీరియల్ లో ఆమె నటన చూసి ఆదా ఇష్క్ అనే వెబ్ సిరీస్ లో అవకాశం వచ్చింది.
అది ఊట్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.ఆదా ఇష్క్ వెబ్ సిరీస్ తో ఈమె ప్రముఖ దర్శకురాలు అయినా కిరణ్ రావు మనసు దోచేసింది.
అలా కిరణ్ రావు దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో ఏకంగా ప్రతిభా రాంటా కు హీరోయిన్ గా అవకాశం ఇవ్వడంతో ప్రస్తుతం ఇది టాక్ ఆఫ్ ది బాలీవుడ్ గా మారింది.