అంగరంగా వైభవంగా సీరియల్ నటి పెళ్లి.. వైరల్ గా మారిన వీడియో!

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల ట్రెండింగ్ నడుస్తోంది అని చెప్పవచ్చు.ఈ మధ్య కాలంలోనే బాలీవుడ్ లో పలువురు జంటలు పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసిందే.

 Serial Actress Deepa Jagadeesh Got Married, Serial Actress, Wedding, Video Viral-TeluguStop.com

ఇటీవల తాజాగా అలియా భట్, రణ్ వీర్ సింగ్ లు మూడుముళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే.అయితే కేవలం వెండితెర సెలబ్రిటీలు మాత్రమే కాకుండా బుల్లితెర సెలబ్రిటీలు సైతం ఒకరి తరువాత మరొకరు పెళ్లిపీటలు ఎక్కుతున్నారు.

అయితే తాజాగా కన్నడ, తెలుగు సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న సీరియల్ నటి దీపా జగదీష్ వివాహం బంధంతో ఏడు అడుగులు వేసింది.

మొదటి 2018లో ప్రీతి కేళి స్నేహ కలేడుకొల్లబెది సినిమాతో కెరీర్‌ను ప్రారంభించింది.

ఆ తర్వాత వెండితెరపై కాకుండా బుల్లితెరపై ప్రసారమయ్యే పలు సీరియల్స్ లో నటించింది.ఈ క్రమంలోనే తెలుగు సీరియల్‌ ప్రేమ నగర్‌ సీరియల్ లో నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.

ఈ సీరియల్ లో వాణి శ్రీ, ముఖేష్‌ గౌడ్‌, ప్రమోధినితో స్క్రీన్ షేర్ చేసుకుంది దీపా.ఈ సీరియల్‌కు ప్రేక్షకుల మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

అనంతరం మనసినక్కరే, బ్రహ్మాస్త్ర, కావ్యాంజలి, క్రిటికల్‌ కీర్తనేగలు, మల్లి నిండు జాబిలి లాంటి సీరియల్స్‌లో నటించి నటిగా మంచి గుర్తింపును ఏర్పరుచుకుంది.

ఇకపోతే ప్రస్తుతం దీపా జగదీశ్ స్టార్ మా లో ప్రసారం అవుతున్న మల్లి సీరియల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా బుధవారం మే 18 దీపా జగదీష్‌ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.ఈమె సాగర్‌ అనే వ్యక్తిను పెళ్లాడింది.

అయితే ఈ పెళ్లికి ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు స్నేహితులు అలాగే ఆమెతో పాటు కలిసి పనిచేసే నటీనటులు కూడా హాజరయ్యారు.దీపా జగదీష్‌కు తాళి కట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది.

ఇది చూసిన అభిమానులు, పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube