చాట్ చేస్తూ నటికి ఐ లవ్ యు చెప్పిన నెటిజన్...

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలు అందరికీ అందుబాటులోకి రావడంతో సెలబ్రిటీలకు మరియు అభిమానులకు మధ్య దూరం చాలా తగ్గిపోయింది.

దీంతో కొంత మంది అభిమానులు తమ అభిమాన నటుల గురించి పలు ఆసక్తికర అంశాలను సోషల్ మీడియా షేర్ చేస్తూ ఉంటే మరి కొంతమంది మాత్రం అసభ్యకరంగా పోస్ట్ లు షేర్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

తాజాగా ఓ మలయాళ సినీ పరిశ్రమకు చెందిన నటి అపర్ణ నాయర్ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభిమానులతో ముచ్చటించింది.అయితే ఇందులో ఓ నెటిజన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఐ లవ్ యూ అంటూ కామెంట్ చేశాడు.

దీంతో అపర్ణ నాయర్ ఈ విషయం గురించి స్పందిస్తూ నెటిజన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.అంతేకాక తనని ప్రేమిస్తున్నానని కామెంట్ చేసినటువంటి వ్యక్తి ప్రొఫైల్ కూడా చెక్ చేశానని అతనికి ఒక కూతురు కూడా ఉందని అలాంటి వ్యక్తి ఇతరులతో ఎలా ప్రవర్తించాలో తెలియకుండా ఏకంగా ఐ లవ్ యూ అంటూ కామెంట్ చేయడం సరి కాదని అంటోంది.

అయితే ఈ విషయాన్ని కొంత మంది నెటిజన్లు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ చేస్తున్నారు.అంతేగాక కొంతమంది అభిమానులు తమ అభిమాన నటీనటులకు ఇలా తమ ప్రేమను వ్యక్త పరుస్తూ ఉంటారని కాబట్టి టేక్ ఇట్ ఈజీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

అయితే ఈ విషయం ఇలా ఉండగా అపర్ణ నాయర్  చిత్రాల్లో క్యారెక్టర్  నటించింది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు