తెలుగు సినీ ఇండస్ట్రియల్ యంగ్ రెబల్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ప్రభాస్( Prabhas ) బాహుబలి( Baahubali ) సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు.ఇక ఈ సినిమా తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ గురించి ఇప్పటివరకు ఆయనతో కలిసి నటించినటువంటి నటీనటులు స్నేహితులు ఎన్నో విషయాలను వెల్లడించారు.
ముఖ్యంగా ప్రభాస్ ఇతరులకు ఇచ్చే ఆతిథ్యం గురించి కూడా ఎన్నో సందర్భాలలో సెలబ్రిటీలు ప్రభాస్ గురించి ఎంతో గొప్పగా తెలియజేశారు.
ప్రభాస్ పూర్వికుల నుంచి కూడా రాజుల కుటుంబానికి చెందినవారు కావడంతో ఇంటికి ఎవరైనా వస్తే వారికి కడుపునిండా భోజనం పెట్టినదే పంపించేవారు కాదు ఇలా శత్రువు ఇంటికి వచ్చిన ఆతిథ్యం ఇవ్వాలి అన్న మనస్తత్వం ప్రభాస్ కుటుంబ సభ్యులది.
ఇక తన పెదనాన్న నుంచి ఇవే అలవాట్లు నేర్చుకున్నటువంటి ప్రభాస్ కూడా సినిమా షూటింగ్లో ఉంటే అందరికీ కూడా తన ఇంటి భోజనం తెప్పిస్తారు.ఇక ఈయన భోజనం పెట్టి చంపుతారు అంటూ కూడా చాలామంది కామెంట్స్ చేశారు.
అంత అద్భుతంగా అన్ని రకాల భోజనాలు ప్రభాస్ పెట్టిస్తారని చెబుతూ ఉంటారు.ఇలా ఫుడ్ అంటే ఎంతో ఇష్టపడే ప్రభాస్ అలాగే తన పక్క వారికి కూడా అంతే ఇష్టంగా ఫుడ్ పెడతారని మనకు తెలుసు.
ఇక ప్రభాస్ కి స్నేహితుడు అయినటువంటి నటుడు రాజా శ్రీధర్(Raja Sridhar) గురించి చెప్పాల్సిన పనిలేదు.ఈయన ప్రస్తుతం పలు సీరియల్స్ లో కూడా నటిస్తున్నారు ఇక ఈయన భార్య గీత(Geetha) తో కలిసి యూట్యూబ్ వీడియోలు ఇంస్టాగ్రామ్ రీల్స్ కూడా చేస్తూ మంచి సక్సెస్ అయ్యారు.ఇక వీరు ప్రభాస్ కి దూరపు బంధువులు కావడమే కాకుండా మంచి స్నేహితులు కూడా దీంతో తరచూ ప్రభాస్ వాళ్ళ ఇంటికి వీరిని భోజనానికి కూడా పిలుస్తూ ఉంటారని తెలియజేశారు.అంతేకాకుండా ప్రభాస్ ఇప్పుడైనా తన భార్య గీత చేతి వంట తినాలనిపిస్తే ఫోన్ చేసి వంటలు చేయించుకొని మరి తీసుకెళ్తారని తెలిపారు.
ముఖ్యంగా గీత ఉండే టమోటా పచ్చడి, రొయ్యల వేపుడు, గోంగూర మటన్ అంటే ప్రభాస్ కి చాలా ఇష్టమని ఆయనకు తినాలి అనిపించినప్పుడు లేదా ఎవరైనా తన ఇంటికి డైరెక్టర్లు గెస్ట్లుగా వస్తే ఈ వంటలు చేసి పంపించమని తనకు ఫోన్ చేసి చెప్తారని శ్రీధర్ తెలిపారు.ఇలా ప్రభాస్ తో వర్షం సినిమా( Varsham Movie ) సమయంలో జరిగిన సంఘటన గురించి కూడా ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడారు వైజాగ్ వెళ్తున్నామని ట్రైన్లో ఫస్ట్ క్లాస్ లో మేం బయలుదేరుతూ ఉండగా ప్రభాస్ కి ఫుడ్ మొత్తం అరేంజ్ చేసామని తెలిపారు.ఇక ప్రభాస్ భోజనం చేయాలి అంటే అన్ని రకాల జంతువులు ఆయన టేబుల్ పై ఉండాలి చికెన్ మటన్ రొయ్యలు పీతలు అన్నం పప్పు సాంబార్ రసం ప్రతి ఒక్కటి కూడా తన టేబుల్ పైన ఉండాలని తెలిపారు.
ఇలా ప్రభాస్ భోజనానికి కూర్చుంటే అన్నీ ఉండాలి ఇలా ట్రైన్లో అన్ని ఏర్పాటు చేసాము.అయితే డార్లింగ్ టమోటా రసం ఉందా అని నన్ను అడిగారు.అక్కడ అది లేదు లేదని చెబితే నాకు టమోటా రసం కావాలి అని ఆయన అడిగారు దీంతో ట్రైన్లో టమోటా రసం ఎక్కడి నుంచి తేవాలి అని ఆలోచిస్తూ ఉండగా నెక్స్ట్ స్టేషన్ ఏంటి అని అడిగారు.
రాజమండ్రి అనడంతో వెంటనే తనకు తెలిసినటువంటి రాజమండ్రిలో అతనికి ఫోన్ చేసి ప్రస్తుతం ట్రైన్ ఇక్కడ వస్తుంది రాజమండ్రి వచ్చేలోపు నాకు టమోటో రసం కావాలి అని అడిగారు అది అయిపోయిన తర్వాత వడియాలు ఉన్నాయా డార్లింగ్ అన్నారు లేవు అని చెప్పడంతో వెంటనే ఆయనకే ఫోన్ చేసి వడియాలు కూడా కావాలి అని చెప్పారు అలా నెక్స్ట్ స్టేషన్ రాజమండ్రి వచ్చేసరికి ప్రభాస్ రసం వడియాలు వచ్చాయని తెలిపారు.ఇలా ఆయన ఏమి తింటారో ఏమి తినరో తెలియదు కానీ భోజనానికి వెళ్లే సమయానికి టేబుల్ పై అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఉండాలి అంటూ తాజాగా రాజ శ్రీధర్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.