రైతులు( Farmers ) ఏ పంట వేసిన అధిక దిగుబడులు సాధించాలంటే కచ్చితంగా సాగుకు ముందే ఆ పంటపై సరైన అవగాహన ఉండాలని వ్యవసాయ క్షేత్ర నిపుణులు చెబుతున్నారు.ఎందుకంట.
పంటకు వివిధ రకాల చీడపీడలు లేదా తెగుళ్లు ఆశించిన తర్వాత వాటిని గుర్తించి అరికట్టే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయే అవకాశం ఉంటుంది.అదే సమయంలో పంటలకు చీడపీడలు( Pests ) లేదా తెగులు ఆశిస్తాయో అవగాహన ఉంటే పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ వెంటనే సంరక్షక చర్యలు చేపట్టడం చేయవచ్చు.
ఈ క్రమంలోనే చాలామంది రైతులు క్యాబేజీ పంటను సాగు( Cabbage Cultivation ) చేసి ఫ్లీ పెంకు పురుగుల నుంచి పంటను సంరక్షించుకోవడం ఆలస్యం చేసుకుంటూ నష్టాలను కొని తెచ్చుకుంటున్నారు.
క్యాబేజీ పంటను ఆశించే ఫ్లీ పెంకు పురుగులు నలుపు రంగులో ఉండి కోడిగుడ్డు ఆకారంలో శరీరాన్ని కలిగి ఉంది చిన్నగా ఉంటాయి.ఈ పురుగుల లార్వాలు మట్టిలో ఉంటూ వేర్లను లేదా దుంపలను ఆహారంగా తీసుకుంటాయి.ఇవి పెరిగిన తర్వాత లేత మొక్కలను తింటాయి.
కలుపు మొక్కలను తమ ఆవాసాలుగా ఏర్పాటు చేసుకొని క్యాబేజీ పంటపై దాడి చేస్తాయి.క్యాబేజీ ఆకులకు చిన్నచిన్న రంధ్రాలు చేస్తాయి.
మొక్కల కణజాలాన్ని పూర్తిగా నష్టపరిచి కణజాలం చుట్టూ పసుపు పచ్చ రంగు వలయం ఏర్పరుస్తాయి.
కాబట్టి క్యాబేజీ పంట ( Cabbage Cultivation )వేసిన పొలంలో కలుపు మొక్కలు ( Weeds )లేకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.పెంకు పురుగులను ఆకర్షించే వల పంటలను వేయాలి.పంట పొలంలో ఈ లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా అసిటమిప్రిడ్, మాలాథియాన్ లాంటి రసాయన మందులను పిచికారి చేసి తొలి దశలోనే ఈ పురుగులను అరికట్టాలి.