రెండోసారి పెళ్లి చేసుకున్న డాక్టర్ బాబు.. వైరల్ అవుతున్న ఫోటోలు!

బుల్లితెర నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు పరిటాల నిరూపమ్ ( Paritala Nirupam ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈయనని నిరూపమ్ అంటే బహుశా చాలామంది గుర్తుపట్టకపోవచ్చు ఏమో కానీ డాక్టర్ బాబు అంటే మాత్రం టక్కున ఈయన గుర్తుకు వస్తారు.

కార్తీకదీపం ( Karthika Deepam ) సీరియల్ ద్వారా డాక్టర్ బాబుగా ఎంతో మంచి గుర్తింపు పొందిన నిరూపమ్ ప్రస్తుతం కార్తీకదీపం 2 సీరియల్ ద్వారా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే డాక్టర్ బాబు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు తన భార్య మంజుల (Manjula) తో కలిసి ఈయన యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా తాజాగా డాక్టర్ బాబు సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలను చూస్తుంటే ఈయన రెండోసారి పెళ్లి( Second Marriage ) చేసుకున్నారని తెలుస్తోంది.రెండో పెళ్లి అంటే మరొక అమ్మాయిని కాదండోయ్ తన భార్యనే రెండో పెళ్లి చేసుకున్నారు.

నిరూపమ్ సీరియల్ నటి మంజులను ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.సరిగా వీరి వివాహం జరిగి అక్టోబర్ 13వ తేదీకి 15 సంవత్సరాలు అయ్యింది.

Advertisement

ఇలా తమ 15వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా మరోసారి వీరిద్దరూ హిందూ సాంప్రదాయబద్దంలో పెళ్లి చేసుకున్నారు.ఇలా డాక్టర్ బాబు రెండోసారి తన భార్య మంజుల మెడలో మూడు ముళ్ళు వేశారు.ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా ఈ జంటకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇలా కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరూ మరోసారి పెళ్లి చేసుకోవడంతో ఈ పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు