తెలుగు సినిమా ప్రేక్షకులకు కావచ్చు, రెండు రాష్ట్రాల ప్రజల్లో ఉన్న సినీ అభిమానులకు కావచ్చు రామ్ గోపాల్ వర్మ పేరు సుపరిచితమే.ఏదో ఒక సందర్భంలో రామ్ గోపాల్ వర్మ పేరు వినడం కాని, చూడడం కానీ చేసి ఉండవచ్చు.
ఇతర దర్శకులు మంచి కథను ఎన్నుకొని ఎటువంటి కాంట్రవర్సీలు లేకుండా సినిమాలు చేస్తుంటారు.కాని రామ్ గోపాల్ వర్మది దీనికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి స్టైల్.
అయితే పెద్ద పెద్ద వ్యక్తులను టార్గెట్ చేసి వాళ్లపై సినిమాలు తీస్తూ ఒకరకంగా వాళ్ళను సమాజంలో కించ పరుస్తూ ఉన్న పరిస్థితి ఉంది.అయితే రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలు ఎంత వివాదాస్పదమో రామ్ గోపాల్ వర్మ ట్వీట్స్ కూడా అంతే వివాస్పదమవుతుంటాయి.
అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ పెద్ద ఎత్తున సంచలనంగా మారింది.
రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ లో ఏముందనే విషయాన్ని పరిశీలిస్తే నన్ను ఒమెగా బ్రదర్స్, ఓ మాజీ సీఎం కుమారుడు కిడ్నాప్ చేసారంటూ ఆర్జీవీ మిస్సింగ్ అనే సినిమా తీస్తున్నట్టు నేడు ఉదయం 9:30 నిమిషాలకు ఈ సినిమాకు సంబంధించిన సినిమా ట్రైలర్ ను రామ్ గోపాల్ వర్మ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.అయితే ఏకంగా పెద్ద పెద్ద వ్యక్తులను ఈ సినిమాలో ఆర్జీవీ టార్గెట్ చేయడంతో ఒక్కసారిగా అందరూ అలర్ట్ అయిన పరిస్థితి ఉంది.ఈ ట్రైలర్ లో ఆర్జీవీ దేని గురించి ప్రస్తావించనున్నారనే విషయంపై పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది.అయితే మరల ఏదైనా కాంట్రావర్సీ లేపడానికి ప్రయత్నిస్తున్నారా లేక తన వ్యక్తిగత అభిప్రాయాన్ని సినిమాగా తీస్తున్నారా అనేది ట్రైలర్ విడుదల తరువాత ఆర్జీవీ చెప్పే విషయాలను బట్టి మనకు తెలిసే అవకాశం ఉంది.
ఏది ఏమైనా ఆర్జీవీ మరో సంచాలనానికి తెర దీశాడని చెప్పవచ్చు.