టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.టీఎస్పీఎస్సీలో సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్ ఓ యువతి సోదరుడి కోసం పేపర్ లీక్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు.
రేణుక అనే యువతి ప్రవీణ్ చేత పేపర్ లీక్ చేయించినట్లు తెలుస్తోంది.అయితే రేణుక ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంది.
అడ్మిన్ డిపార్ట్ మెంట్ లో పని చేసే రాజశేఖర్ ను ప్రవీణ్ పేపర్ గురించి అడిగాడు.ఈ క్రమంలో సెక్షన్ ఆఫీసర్ సిస్టమ్ లో ఉందని రాజశేఖర్ చెప్పగా పెన్ డ్రైవ్ లో పేపర్ ను కాపీ చేసుకున్నాడని అధికారులు తెలిపారు.
అనంతరం పేపర్ ప్రింట్ ను ప్రవీణ్ రేణుకకు ఇచ్చాడని తెలుస్తోంది.డబ్బు ఆశతో రేణుక ఆ పేపర్ ను సర్పంచ్ కొడుకుకు లీక్ చేయగా.
తను మరో ముగ్గురికి లీక్ చేశాడని అధికారులు నిర్ధారించారు.ఈ నేపథ్యంలో మొత్తం రూ.14 లక్షలు వసూలు చేసిన రేణుక ప్రవీణ్ కు రూ.10 లక్షలు ఇచ్చింది.కేసులో వేగవంతంగా విచారణ చేస్తున్న పోలీసులు ఇప్పటివరకు 13 మందిని అదుపులోకి తీసుకున్నారు.







