ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scan ) కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha ) రిమాండ్ రిపోర్టులో ఈడీ సంచలన విషయాలను పొందుపరిచింది.మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారుల్లో కవిత ఒకరని ఈడీ పేర్కొందని తెలుస్తోంది.లిక్కర్ స్కాంలో కవిత కుట్రదారు, లబ్ధిదారన్న ఈడీ సౌత్ లాబీలో శరత్ రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, శ్రీనివాసుల రెడ్డితో( Srinivasula Reddy ) కలిసి ఆప్ నేతలకు రూ.100 కోట్లు లంచం ఇచ్చారని ఆరోపించింది.మార్జిన్ మనీని 12 శాతానికి పెంచి సగం ముడుపుల రూపంలో చెల్లించారని, లిక్కర్ కేసు జాప్యం చేయడానికి తప్పుడు కేసులు దాఖలు చేశారని ఈడీ రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది.సమన్లు జారీ చేసిన తరువాత నాలుగు ఫోన్ల డేటాను ఫార్మాట్ చేశారని, తప్పుుడు సమాచారం ఇచ్చారని తెలిపింది.కవిత అరెస్టులో నిబంధనలు అన్నీ పాటించామని పేర్కొన్నారు.తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఈడీ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు