దివంగత బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత( Lasya Nanditha ) కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేశారు.లాస్య మృతికి పీఏ మరియు డ్రైవర్ అయిన ఆకాశే కారణమని( Akash ) వారు ఆరోపించారు.
ఆకాశ్ బలవంతంగా లాస్యను తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు చెబుతున్నారని తెలుస్తోంది.అయితే ఇప్పటికే పీఏ ఆకాశ్ పై లాస్య సోదరి నివేదిత( Niveditha ) పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో ఆకాశ్ పై పటాన్ చెరు పోలీసులు( Patancheru Police ) కేసు నమోదు చేశారు.కాగా ఎమ్మెల్యే లాస్య నందిత పటాన్ చెరు ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.ఇదే ప్రమాదంలో పీఏ ఆకాశ్ తీవ్రంగా గాయపడటంతో ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.