ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు బయటపెట్టిన జర్నలిస్ట్.. అట్లు, అరకేజీ జిలేబీ అంటూ?

సీనియర్ ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లకు సంబంధించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి.ప్రముఖ జర్నలిస్ట్ లలో ఒకరైన ఇమంది రామారావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

 Senior Ntr Shocking Food Habits Details Here Goes Viral In Social Media , Senior-TeluguStop.com

సీనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితులలో ఇమంది రామారావు కూడా ఒకరు.ఒకసారి ఏదైనా విన్నా సీనియర్ ఎన్టీఆర్ కు గుర్తుండిపోతుందని ఇమంది రామారావు తెలిపారు.

ఎవరైనా సీరియస్ గా మాట్లాడుతున్నా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఎన్టీఆర్ కు అస్సలు నచ్చేది కాదని ఆయన కామెంట్లు చేశారు.ఇష్టానుసారం కూర్చున్నా ఎన్టీఆర్ కు నచ్చదని ఇమంది రామారావు తెలిపారు.

సీనియర్ ఎన్టీఆర్ బయటకు వెళ్లిన సమయంలో ఆయన మొదటి భార్య ఎదురు వచ్చేవారని ఆయన కామెంట్లు చేశారు.సీనియర్ ఎన్టీఆర్ సెంటిమెంట్లను ఫాలో అయ్యేవారని ఇమంది రామారావు అన్నారు.

ఎన్టీఆర్ కు తమ్ముడంటే ప్రేమాభిమానాలు ఎక్కువని ఆయన కామెంట్లు చేశారు.సీనియర్ ఎన్టీఆర్ కౌంజు పిట్టల మాంసం, చికెన్, మటన్, చేపలు అన్నీ తినేవారని ఆయన వెల్లడించారు.తిండి పెడుతుంటే తింటూనే ఇమంది రామారావు తెలిపారు.అట్లు, అరకేజీ జిలేజీ, బజ్జీలు తినేవారని ఆయన కామెంట్లు చేశారు.పని కూడా ఎవరూ చేయలేని విధంగా చేసేవారని ఆయన కామెంట్లు చేశారు.

40 ఏళ్ల క్రితమే ఎన్టీఆర్ 8 లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారని బోగట్టా.స్క్రీన్ చూడకుండా పేపర్ చూసి ఆయన డబ్బింగ్ చెప్పేవారని ఇమంది రామారావు చెప్పుకొచ్చారు.ఒక సినిమా సమయంలో ఎన్టీఆర్ 29 కూల్ డ్రింక్స్ తాగారని 10 ప్యాకెట్ల సిగరెట్లు కాల్చారని ఒక సీన్ కోసం అలా చేశారని ఇమంది రామారావు తెలిపారు.

సీనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరీర్ లో 295కు పైగా సినిమాలలో నటించారు.ఈ సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube