తెలుగు ప్రేక్షకులకు మహానటుడు సీనియర్ ఎన్టీఆర్( Senior NTR ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నందమూరి తారక రామారావుకి తెలుగువారి మనసులలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
కేవలం హీరోగా మాత్రమే కాకుండా రైటర్ గా దర్శకుడిగా నిర్మాతగా అన్ని రంగాలలో తనదైన ముద్రను వేసుకున్నారు సీనియర్ ఎన్టీఆర్.హీరోగా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.
అంతేకాకుండా దర్శకుడిగా కూడా ఎంతోమంది హీరోలకు లైఫ్ ఇచ్చారు.కేవలం సినిమాలపరంగానే కాకుండా రాజకీయాల్లోకి( politics ) కూడా ఎంట్రీ ఇచ్చి విజయం సాధించారు.

ఇకపోతే అప్పట్లో ఎన్టీఆర్ తన తోటి నటీనటులతో ఎలా ఉండేవారు అన్న విషయానికి వస్తే.సినిమా కోసం పని చేసే ప్రతి వ్యక్తితో ఎన్టీఆర్ చాలా మర్యాద పూర్వకంగా ఉండేవారట.అంతేకాకుండా వారితో మంచి అనుబంధాన్ని కూడా ఏర్పరచుకునేవారట.ఈ క్రమంలోనే మహానటి సావిత్రిని( Mahanati Savitri ) సోదరిగా చూసేవారట.ఆమెను సావిత్రమ్మ అంటూ ఎంతో ప్రేమగా పిలిచేవారట.ఎన్టీఆర్, సావిత్రి చాలా సినిమాల్లో హీరోహీరోయిన్ లుగా నటించారు.
గుండమ్మ కథ, మిస్సమ్మ, పాండవ వనవాసం, అప్పు చేసి పప్పుకూడు లాంటి చాలా సినిమాలలో నటించి మెప్పించారు.ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన చాలా సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి.

అంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ ఎన్టీఆర్ తన తోటి నటీనటులతో ఎంతో మర్యాదపూర్వకంగా ఉండేవారు.ఆయనతో కలిసి పని చేసేవారు ఎన్టీఆర్ చాలా గ్రేట్ అంటూ పొగడ్తలు కురిపించేవారు.ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు( NTR centenary celebrations ) జరగనున్న సంగతి మనందరికీ తెలిసిందే.ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతూనే ఉన్నాయి.
అయితే ఈ వేడుకలు కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకలు జరగనున్నాయి.ఈ క్రమంలోనే అమెరికా టెక్సాస్, ఖతార్ దోహా వంటి దేశాల్లో ఈ ఉత్సవాలు ఇటీవల జరిగాయి.
ఇక ఈ నెల 28న శత జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.







