ఆ వైసీపీ ఎమ్మెల్యే టీడీపీ లో చేరుతున్నారా ?  టికెట్ తో పాటు మంత్రి పదవి ఆఫర్ ? 

ఎన్నికలు సమీపిస్తుండడంతో, ఏపీలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి.ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి వలసలు మొదలయిపోయాయి.

ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీలో( YCP ) చేపట్టిన నియోజకవర్గ ఇన్చార్జిల మార్పు వ్యవహారం ఆ పార్టీ కి పెద్ద తలనొప్పిగానే మారింది.టిక్కెట్ దక్కలేదని, ప్రాధాన్యం లభించడం లేదని చాలామంది నాయకులు ఇతర పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తుండడంతో, ఆ పార్టీలో గందరగోళ పరిస్థితి నెలకొంది.

ఇది ఇలా ఉంటే.పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే వైసీపీని వీడే అవకాశాలు ఉన్నట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి.

ఆయన తనకు పార్టీలో సరైన ప్రాధాన్యం దక్కడం లేదని , మంత్రి పదవి జగన్( Jagan ) ఇవ్వలేదనే అసంతృప్తితో చాలా కాలంగా ఉంటున్నారు.అయితే ఆ అసంతృప్తిని గుర్తించిన టిడిపి తమ పార్టీలో చేరాల్సిందిగా ఆఫర్ కూడా ఇస్తున్నట్లు సమాచారం.

Advertisement

పెనుమలూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కొలుసు పార్థసారధి( Kolusu Parthasarathy ) వైసీపీ ని వీడెందుకు సిద్ధమవుతున్నారట.

ఆయన వచ్చే ఎన్నికల్లో పెనుమలూరు( Penumaluru ) నుంచి కాకుండా,  మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు సమాచారం.టీడీపి కి చెందిన కీలక నేతలు కొంతమంది పార్థసారథి తో చర్చించి , తమ పార్టీలు చేరితే ఏ ప్రయోజనాలు కలుగుతాయో వివరించినట్లు సమాచారం.దీంతో పార్థసారథి తన ప్రధాన అనుచరులతో సమావేశమై , పార్టీ మారే విషయంపై చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కొలుసు పార్థసారథి సీనియర్ నేత , వైసీపీలో ఆయన కీలకంగానే వ్యవహరించేవారు.కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ మంత్రిగా పనిచేశారు .2019 ఎన్నికల్లో పెనుమలూరు నియోజకవర్గం నుంచి గెలిచిన పార్థసారధి మంత్రి పదవిపై( Minister Seat ) ఆశలు పెట్టుకున్నారు.మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా,  పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసినా,  జగన్ తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో అసంతృప్తి చెందారు.

బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన పార్థసారధి మొదటి విడతలో తనకు అవకాశం దొరుకుతుందని భావించారు.అయితే నెల్లూరు జిల్లాకు చెందిన అనిల్ కుమార్ కు( Anil Kumar ) మంత్రి పదవి ఇవ్వడంతో, రెండో విడతలో తనుకు మంత్రి పదవి ఖాయమని పార్థసారథి భావించారు.కానీ తణుకు ఎమ్మెల్యే కారుమూరు నాగేశ్వరావు కు( Karumuri Nageswara Rao ) మంత్రి పదవి దక్కడం తో అప్పటినుంచి పార్థసారధి అసంతృప్తి తో ఉంటున్నారు.

రూ. 1 కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినా.. కంటెస్టెంట్ కి నిరాశే..?
అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?

ఆయన అసంతృప్తిని గుర్తించిన టిడిపి( TDP ) తమ పార్టీలు చేరితే అసెంబ్లీ టికెట్ తో పాటు, పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామనే హామీలు కూడా ఇచ్చారట.అయితే పెనుమూలురు నుంచి కాకుండా ,నూజివీడు నుంచి పోటీ చేయాలని టిడిపి కండిషన్ పెట్టిందట.

Advertisement

దీంతో తాను వైసీపీలో సరైన ప్రాధాన్యం లేకుండా ఉండడం కంటే,  తనకు ప్రాధాన్యమిస్తూ,  పార్టీలో చేరాల్సిందిగా ఆఫర్లు ఇస్తున్న టిడిపిలో చేరడమే తన రాజకీయ భవిష్యత్తుకు మంచిదనే ఆలోచనతో పార్థసారధి ఉన్నట్లు సమాచారం.

తాజా వార్తలు