అన్ స్టాపబుల్ సీజన్1 కు చిరంజీవి హాజరు కాకపోవడం బాలయ్య అభిమానులను, చిరంజీవి అభిమానులను బాధ పెట్టిన సంగతి తెలిసిందే.అన్ స్టాపబుల్ సీజన్1 భారీ సక్సెస్ సాధించగా సీజన్2 కు ఆ రేంజ్ లో రెస్పాన్స్ రాకపోవడంతో బాలయ్య అభిమానులు ఫీలవుతున్నారు.
అన్ స్టాపబుల్ తర్వాత ఎపిసోడ్ కు ప్రభాస్, గోపీచంద్ కలిసి రానున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.
డిసెంబర్ 31వ తేదీన ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా.
అయితే ప్రముఖ జర్నలిస్ట్ భరద్వాజ్ తాజాగా మాట్లాడుతూ చాలా కాలం క్రితం కోదండరామిరెడ్డి చిరంజీవి బాలయ్య కాంబోలో సినిమా తీస్తానని చెప్పారని పేర్కొన్నారు.అయితే కథ నచ్చకపోవడంతో ఈ ప్రాజెక్ట్ రాలేదని తెలిపారు.
చిరంజీవి బాలయ్యలకు మార్కెట్ ఉన్న సమయంలో మల్టీస్టారర్లకు ప్రాధాన్యత తగ్గాయని ఆయన పేర్కొన్నారు.
మల్టీస్టారర్స్ కు సంబంధించి ఎన్నో వివాదాలు ఉన్నాయని భరద్వాజ్ అన్నారు.

అన్ స్టాపబుల్ కు చిరంజీవి వస్తారా రారా అనే చర్చ జరుగుతోందని తెలిపారు.బెల్లంకొండ సురేష్ కాల్పుల ఘటన జరిగిన సమయంలో బాలయ్యతో చిరంజీవి ఎక్కువ సమయం ఉన్నారని భరద్వాజ్ చెప్పుకొచ్చారు.చిరంజీవి బాలయ్య కాంబినేషన్ లో మల్టీస్టారర్ చేయాలని అల్లు అరవింద్ భావిస్తే సమస్య రాదని ఆయన కామెంట్లు చేశారు.

రాజమౌళితో ఈ కాంబినేషన్ లో సినిమా చేస్తే బాగుంటుందని భరద్వాజ్ తెలిపారు.రాజమౌళి కూడా ఈ కాంబినేషన్ కు ఓకే చెప్పే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.రాజమౌళి మాత్రమే పాన్ వరల్డ్ సబ్జెక్ట్ ను డిజైన్ చేయగలరని చెప్పుకొచ్చారు.
సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







