ఫోర్జరీ కేసులో నంద కుమార్ కు బెయిల్ మంజూరు అయింది.ఈ మేరకు హైదరాబాద్ నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.రూ.10 వేల పూచీకత్తుతో రెండు షూరిటీలు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.
అదేవిధంగా మరో కేసులో నంద కుమార్ పై పీటీ వారెంట్ ఇవ్వాలని బంజారాహిల్స్ పోలీసులు కోర్టును కోరారు.అయితే నందుపై ఎన్ని కేసులు నమోదు అయ్యాయో వివరాలు ఇవ్వాలని కోర్టు తెలిపింది.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో నంద కుమార్ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే.







