Shobhan Babu : శోభన్ బాబు ఆస్తుల విలువ ఏకంగా రూ.లక్ష కోట్లా.. షాకింగ్ విషయాలు రివీల్!

సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన శోభన్ బాబు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల మనస్సులను గెలుచుకోవడంతో పాటు సోగ్గాడిగా ఇమేజ్ ను సంపాదించుకున్నారు.

సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును శోభన్ బాబు భూములపై ఇన్వెస్ట్ చేయగా ప్రస్తుతం ఆ భూముల విలువ వేల కోట్ల రూపాయలుగా ఉంది.

సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.శోభన్ బాబు గారు నాతో ప్రాపర్టీ విషయాలు చెప్పేవారని ఆయన కామెంట్లు చేశారు.

శోభన్ బాబు గారికి కోపం వస్తే ఆ కోపం తాటాకు మంటలాంటి కోపం అని ఇమంది రామారావు తెలిపారు.షేర్స్ లో ఆయన ఇన్వెస్ట్ చేసేవారని రామారావు పేర్కొన్నారు.

భూమి మాత్రం పెరగదని అందువల్ల భూమి వాల్యూ పెరుగుతుందని శోభన్ బాబు చెప్పేవారని ఇమంది రామారావు వెల్లడించడం గమనార్హం.ఆయన వందల ఎకరాలు కొనుగోలు చేసేవారని ఇమంది రామారావు అన్నారు.

Advertisement

మురళీ మోహన్ గారు శోభన్ బాబుకు 80,000 కోట్ల రూపాయల ఆస్తి ఉంటుందని చెప్పారని ఆయన తెలిపారు.శోభన్ బాబు గారు భూమిని నమ్ముకున్న వాళ్లు ఎప్పటికీ చెడిపోరని భావించారని ఇమంది రామారావు తెలిపారు.

అయితే ఆయన ఆస్తి 80,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉండేది కాదని ఆయన చెప్పుకొచ్చారు.

ఆయన ఫ్యామిలీని బయటకు చూపించడానికి ఇష్టపడేవారు కాదని ఇమంది రామారావు అన్నారు.ఆయన ఆస్తులు ప్రస్తుతం లక్ష కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉండొచ్చని బోగట్టా.ఆదాయపు పన్ను శాఖ అధికారుల నుంచి సమస్యలు వస్తాయని భావించి ఆస్తుల గురించి చెప్పడానికి శోభన్ బాబు వారసులు ఇష్టపడటం లేదని తెలుస్తోంది.

శోభన్ బాబు వయస్సు పెరిగిన తర్వాత సినిమాలలో మంచి ఆఫర్లు వచ్చినా రిజెక్ట్ చేశారు.ప్రేక్షకుల హృదయాల్లో ఆయన ఇప్పటికీ జీవించే ఉన్నారు.

సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?
Advertisement

తాజా వార్తలు