తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ దర్శకులు కే.విశ్వనాథ్ కన్నుమూశారు.
గత కొంతకాలం నుండి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడవటం జరిగింది.దాదాపు 50 సినిమాలకు పైగా దర్శకత్వం వహించారు.92 సంవత్సరాల వయసు కలిగిన ఆయన గత కొంతకాలం వయసు రిత్య వచ్చిన అనారోగ్య సమస్యలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇటీవల మరింతగా ఆరోగ్యం క్షీణించటంతో నగరంలో అపోలో హాస్పిటల్ లో జాయిన్ చేయగా గురువారం రాత్రి… కే.
విశ్వనాధ్ తుది శ్వాస విడవటం జరిగింది.

కే విశ్వనాథ్ మరణంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి.కొద్ది నెలల నుండి తెలుగు చలనచిత్ర రంగంలో చాలామంది ప్రముఖ నటీనటులు వరుస పెట్టి మరణిస్తున్నారు.గత ఏడాది రెబల్ స్టార్ కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ, చలపతిరావు మరణించగా ఈ ఏడాది ప్రారంభంలో కొద్దిరోజుల క్రితం సీనియర్ హీరోయిన్ జమున మరణించడం జరిగింది.కాగా ఫిబ్రవరి 2వ తారీఖు గురువారం రాత్రి సీనియర్ దర్శకులు కే.విశ్వనాథ్ మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.