Radha : బికినీలో సీనియర్ నటి రాధ ఎలా ఉందో చూసారా.. ఫోటోస్ చూస్తే షాక్ అవ్వాల్సిందే?

ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వెండితెర పై ఒక వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్లలో రాధ( Radha ) కూడా ఒకరు.1980 కాలంలో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది రాధ.కాగా రాధా అసలు పేరు ఉదయ చంద్రిక( Udaya chandrika ).కానీ ఆమె రాధ పేరుతోనే మంచి ఫేమ్ ని సంపాదించుకుంది.కాగా ఈమె దక్షిణాదిలో దాదాపుగా 250కు పైగా సినిమాల్లో నటించి మెప్పించింది.ఆ తర్వాత ముంబయికి చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది.ఆ తర్వాత సినిమాలకు గుడ్‌ బై చెప్పేసింది.ఆమె కూతురు కార్తీక తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

 Senior Actress Radha Shares Memory Her Movie Tik Tik Tik-TeluguStop.com

ఈ తరం ప్రేక్షకులకు స్టార్ హీరోయిన్ రాధ అంటే కూడా ఎవరో తెలియదు.కానీ స్టార్ మాలో ప్రసారం అవుతున్న బీబీ జోడి జడ్జ్ రాధా( Bibi Jodi Judge Radha ) అంటే చాలు ఇట్టే గుర్తు పట్టేస్తారు.బీబీ జోడీ షోద్వారా భారీగా పాపులారిటీని ఏర్పరచుకుంది.ఈ షో ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించిన ఆమె ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తోంది.

ఈ నేపద్యంలోనే తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక ఫోటోని షేర్ చేసింది.కమలహాసన్ తో కలిసి నటించిన సినిమాకు సంబంధించిన ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

కాగా ఆ ఫోటోలో రాధ బికినీలో కనిపించడంతో అభిమానులు ఒకసారి గా షాక్ అయ్యారు.

ఈ సందర్భంగా రాధా అందుకు సంబంధించిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది.టిక్ టిక్ టిక్ సినిమా( Tik Tik Tik movie ) షూటింగ్ రోజుల్లో నాకు ఇష్టమైన జ్ఞాపకాలలో ఇదీ ఒకటి.అప్పటికి అది నా కెరీర్‌లో ఒక భాగం.

కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అలా కనిపించడానికి మేము చేసిన పోరాటాన్ని మెచ్చుకుంటున్న.సరైన లుక్‌తో కనిపించిన మాధవికి ప్రత్యేక ప్రశంసలు.

యాటిట్యూడ్‌తో పని చేయగలిగినందుకు ఆమెకు హ్యాట్సాఫ్.కొన్ని జ్ఞాపకాలు ఇప్పుడు గుర్తొస్తే చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది.

ఆలాంటి కొన్ని చెప్పలేని ఆలోచనలను ఇక్కడ పంచుకుంటున్నాను ఈ అందమైన దుస్తులను తయారు చేసిన డిజైనర్ వాణీ గణపతికి మా కృతజ్ఞతలు అని రాసుకొచ్చింది రాధ.కాగా రాధ షేర్ చేసిన ఆ ఫోటోలో కమల్ హాసన్‌ కుర్చీలో ఉండగా.రాధ, స్వప్న, మాధవి ఆయన వెనక నిలబడి ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube