తెలుగు సినీ ఇండస్ట్రీలో బాలయ్య అంటే ఆ క్రేజే వేరు.తెలుగు ఇండస్ట్రీలో బాలయ్య కు ఉన్న అభిమానులు అంతా ఇంతా కాదు.ఆయన సినిమాలంటే ఎదురు చూడకుండా ఉండరు.అంతేకాకుండా ఆయన వ్యక్తిత్వం పట్ల కూడా ఆయనతో కలిసి నటించిన వాళ్ళు చాలా సార్లు చెప్తుంటారు.బాలయ్య బాగా కోపడతారని ఎంతోమంది అంటుంటారు.కానీ నిజానికి బాలయ్య మనస్తత్వం చిన్న పిల్లాడి లాంటిదని ఆయన సన్నిహితులు తెలిపారు.
ఇదిలా ఉంటే సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు తాగుతారన్న సంగతి తెలిసిందే.ఒకప్పుడు బాలయ్య తాగడని వార్తలు వినిపించగా తాను తాగుతానని తానే డైరెక్ట్ గా చెప్పారు.
అంతేకాకుండా తాను తాగే బ్రాండ్ ఏంటో కూడా తెలిపాడు బాలయ్య.ఇక బాలయ్యకు ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులు ఉన్నారు.అంతేకాకుండా తనతో నటించిన వాళ్ళతో కూడా చాలా సన్నిహితంగా ఉంటారు బాలయ్య.ఇదిలా ఉంటే బాలయ్యతో కలిసి మందు కొట్టానని, అంతేకాకుండా తాము తీసుకున్న బ్రాండ్ ఏంటో కూడా తెలిపాడు సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్.
ఈ విధంగా ఆయన మాట్లాడుతూ.

బాలయ్య చాలా లవ్లీ పర్సన్ అని ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వం అని తెలిపాడు.నట జీవితంలో ఒకలా నిజజీవితంలో ఒకలా ఉండరని తెలిపాడు.అందరి దృష్టిలో బాలయ్య ఎలా కనిపిస్తారో అదే నిజం అంటూ పైకి ఒకలా లోపల ఒకలా ఉండరని బాలయ్య గురించి బాగా పంచుకున్నాడు.
అంతే కాకుండా ఆయనకు మెమరీ పవర్ ఎక్కువ అంటూ.బాగా ఎన్టీఆర్ గురించి మాట్లాడుతుంటారని తెలిపాడు.
ఇక బాలయ్య కు పూజలు చేయడం బాగా ఇష్టమని, తనతో బాగా మాట్లాడుతుంటాడని, ఎప్పుడూ తనతో టచ్ లో ఉంటాడని తెలిపాడు.అందరి విషయంలో బాగా కేరింగ్ తీసుకుంటాడని చెబుతున్నాడు.
ఇక సిట్టింగ్ విషయంలో కూడా చాలా మంది హీరోలతో కూర్చొని తాగిన సందర్భాలు ఉన్నాయని చెప్పాడు.తాను కూడా బాలయ్య తో కలిసి సిట్టింగ్ చేసేవాడట.
బాలయ్య బ్రాండ్ మాన్షన్ హౌస్ బ్రాందీ, తాను విస్కీ తాగుతూ బ్రాండ్ బ్లాక్ లేబుల్ అంటూ బాలయ్య బాబు బ్రాండ్ ఏంటో తెలిపాడు.ఇక బాలయ్యతో తనకు మంచి అనుబంధం ఉందని తెలిపాడు సుధాకర్.







