సీనియర్ నటుడు చంద్రమోహన్ ( Chandramohan ) ఆరోగ్య కారణాలతో అపోలో హాస్పిటల్ లో నిన్న మరణించిన సంగతి మనకు తెలిసిందే.ఈ మధ్యకాలంలో చాలామంది సినీ సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు చనిపోవడంతో ఇండస్ట్రీని విషాద ఛాయలు అలుముకున్నాయి.
చంద్రమోహన్ మరణంతో ఆయన అభిమానులు కుటుంబ సభ్యులు తీవ్రంగా దుఃఖిస్తున్నారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
ఇక చంద్రమోహన్ మరణం( Chandra Mohan Death )తో ఆయన గురించి ఎన్నో తెలియని విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అయితే తాజాగా చంద్రమోహన్ సినిమాల్లోకి వచ్చాక ఆయన మొదటి రెమ్యూనరేషన్ ఏంటి.ఆ రెమ్యూనరేషన్ తో ఆయన ఏం చేశారు అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.చంద్రమోహన్ మొదట రంగులరాట్నం ( Rangula Ratnam ) అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.
అయితే ఆయన బతుకునప్పుడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు తన మొదటి రెమ్యూనరేషన్ ఎంత.దాన్ని ఏం చేశారు అనే సంగతి బయట పెట్టారు.చంద్రమోహన్ మాట్లాడుతూ.నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మొదట 3వేల రెమ్యూనరేషన్ తీసుకున్నాను.

అలా వచ్చిన నా మొదటి రెమ్యూనరేషన్( Chandramohan Remuneration ) తో నా చెల్లెళ్ల పెళ్లి చేశాను.అయితే మా నాన్న చనిపోవడంతో చెల్లెళ్ల బాధ్యత పూర్తిగా నాపైనే పడింది.దాంతో చెల్లెళ్ల పెళ్లి చేసి వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలి అనుకున్నాను.అలా ఇద్దరు చెల్లెళ్ళ పెళ్లి నా మూడు సినిమాల రెమ్యూనరేషన్ తో చేశాను.అప్పట్లో 10 నుండి 15వేలతో వారి పెళ్లి అంగరంగ వైభవంగా చేశాను.ఇక అప్పట్లో 15వేల అంటేనే ఎక్కువ.
ఇక నేను నటించిన మొదటి మూవీ హిట్ అవ్వడంతో ఆ తర్వాత మరో రెండు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.కానీ ఆ తర్వాత సినిమాల్లో నటించిన సమయంలో ప్రొడ్యూసర్ డైరెక్ట్ గా నా దగ్గరికి వచ్చి మీకు ఈ సినిమా కి రెమ్యూనరేషన్ ఎంత కావాలి అని అడిగారు.
అలా నేను నా చెల్లెలి పెళ్లి ఉంది నాకు 5 వేలు కావాలండి అనడంతోనే ఆయన మారు మాట్లాడకుండా నాకు 5వేల రెమ్యూనరేషన్ ఇచ్చారు.

అలా 3000 నుండి 5000 వరకు నా రెమ్యూనరేషన్ పెరుగుతూ 5000 కంటిన్యూ చేశాను.ఇక ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్( Chandramohan Movies ), క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్న సమయంలో నా రెమ్యూనరేషన్ చాలా ఎక్కువయింది.నా జీవితంలో ఎక్కువ రెమ్యూనరేషన్ ఐదు లక్షలు.
అంటూ చంద్రమోహన్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.ప్రస్తుతం చంద్రమోహన్ మాటలు నట్టింట్లో వైరల్ అవ్వడంతో చంద్రమోహన్ తన మొదటి రెమ్యూనరేషన్ తో చెల్లిళ్ల పెళ్లి చేశారా అని అందరూ మెచ్చుకుంటున్నారు.