ఇప్పటి వరకూ సీటిమార్ బ్రేక్ ఈవెన్ కి కూడా కలెక్ట్ చెయ్యలేదటగా..

తెలుగులో ఇటీవలే యాక్షన్ హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో నటించిన "సీటిమార్" చిత్రం ఈనెల 10వ తారీఖు న ప్రపంచ వ్యాప్తంగా బ్రహ్మాండంగా విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే.

కాగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తరహాలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది.

అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా మిల్క్ బ్యూటీ "తమన్నా భాటియా" నటించగా తెలుగు ప్రముఖ దర్శకుడు "సంపత్ నంది" దర్శకత్వం వహించాడు.అయితే ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు మంచి పాజిటివ్ టాక్ తో శుభారంభం చేసి కలెక్షన్లు బాగానే సాధించింది.

ఈ క్రమంలో రెండో వారం ఆరంభంలో కూడా అదే జోరు కొనసాగిస్తూ ఇప్పటి వరకు దాదాపుగా 12 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించింది.దీనికితోడు ఇటీవల విడుదలైన ఇతర టాలీవుడ్ చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో ఈ అంశం సీటిమార్ కి బాగానే కలిసొచ్చింది.

కానీ కరోనా వైరస్ కారణంగా గా ప్రజలు సినిమా థియేటర్లకు రావడానికి కొంతమేర జంకుతుండడంతో కలెక్షన్లకి గండి పడింది.అయితే ఇప్పటి వరకు సీటిమార్ చిత్రం దాదాపుగా 12 కోట్ల రూపాయలు సాధించడంతో మరో 2 కోట్ల రూపాయలు సాధిస్తే బ్రేక్ ఈవెన్ ని చేరుకుంటుంది.

Advertisement

దీంతో చిత్ర యూనిట్ సభ్యులు కూడా ప్రమోషన్స్ పై దృష్టి సారించారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా సిటిమార్ చిత్రంతో మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న యాక్షన్ హీరో గోపీచంద్ ఈ ఊపులోనే "ఆరడుగుల బుల్లెట్" చిత్రాన్ని కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.అయితే ఈ చిత్రంలో గోపీచంద్ కి జోడీగా ప్రముఖ హీరోయిన్ "నయనతార" నటించింది.కాగా ఈ చిత్రం షూటింగ్ పనులు పూర్తయి ఇప్పటికే దాదాపుగా కొన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ పలు కారణాల వల్ల ఈ చిత్రం విడుదల వాయిదా పడింది.

Advertisement

తాజా వార్తలు