'సీటిమార్' నుండి కొత్త పోస్టర్.. స్టైలిష్ లుక్ లో గోపీచంద్.. !

టాలీవుడ్ డాషింగ్ అండ్ డైనమిక్ హీరో గోపీచంద్ ఈ రోజు పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న సీటిమార్ సినిమా నుండి ఒక కొత్త పోస్టర్ ను ఆయన పుట్టిన రోజు కానుకగా విడుదల చేసారు.

 Seeti Maar Team Releases Poster For Gopichand-TeluguStop.com

ఈ పోస్టర్ లో స్టైలిష్ లుక్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.అంతేకాదు కాస్ట్యూమ్స్ కూడా కొత్తగా ఉన్నాయి.

ఈ పోస్టర్ లో గోపీచంద్ విజిల్ వేస్తూ కనిపించాడు.

 Seeti Maar Team Releases Poster For Gopichand-సీటిమార్’ నుండి కొత్త పోస్టర్.. స్టైలిష్ లుక్ లో గోపీచంద్.. -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సంపత్ నంది దర్శకత్వంలో సీటిమార్ సినిమా రూపొందుతుంది.

వరుస ప్లాపులతో సతమతమవుతున్నగోపీచంద్ కు ఈ సినిమా కీలకంగా మారింది.కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో గోపీచంద్ కబడ్డీ లేడీస్ టీమ్ కోచ్ గా పనిచేస్తున్నాడు.

ఈ సినిమాలో తమన్నా, దిగంగన సూర్య వంశి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాలో తమన్నా కబడ్డీ టీమ్ కోచ్ జ్వాలా రెడ్డిగా నటిస్తుంది.

ఎమోషన్ తో పాటు థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధంగా ఉంది.ఈ సినిమా ఏప్రిల్ 2 నవిడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా మేకర్స్ ఈ సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

భూమిక కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది.

Telugu Birthday Poster, Gopichand, New Poster, Seeti Maar, Seeti Maar Team Releases Poster For Gopichand-Movie

దీంతో పాటు గోపీచంద్ మారుతీ దర్శకత్వంలో పక్కా కమర్షియల్సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా పక్కా ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.గీత ఆర్ట్స్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది.మరి హిట్టు ప్లాప్ తో సంభంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్న గోపీచంద్ కు సీటిమార్ సినిమా అన్న హిట్ అవుతుందో లేదో చూడాలి.

#SeetiMaar #New Poster #Gopichand #Birthday Poster #Seeti Maar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు