అలాంటి మగవారిని చూస్తే పిచ్చలేస్తుంది.. విష్ణు ప్రియ కామెంట్స్ వైరల్?

తెలుగు బుల్లితెరపై యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

సుడిగాలి సుదీర్ తో కలిసి పోవే పోరా కార్యక్రమం ద్వారా తెలుగు ప్రేక్షకులను సందడి చేసిన ఈమె అతి తక్కువ సమయంలోనే బుల్లితెరకు దూరమయ్యారు.

తాజాగా వాంటెడ్ పండుగాడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా కూడా తీవ్ర నిరాశ కలిగించింది.ఈ క్రమంలోనే ఈమె వెండి తెరకు బుల్లితెరకు దూరమైనప్పటికీ సోషల్ మీడియా వేదికగా అభిమానులను తనదైన శైలిలో సందడి చేస్తూ ఉన్నారు.

సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటోలను షేర్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇకపోతే నిత్యం సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక డాన్స్ వీడియోని షేర్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేసే ఈమె తాజాగా తన పెళ్లి గురించి సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

తనకిప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని 29, 30 సంవత్సరాల వయసుఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి మెచ్యూరిటీ వస్తుందని అప్పుడే తాను కూడా పెళ్లి చేసుకుంటానని ఈమె తెలిపారు.

Advertisement

ఇక తనకు కాబోయే భర్త గురించి కూడా మాట్లాడుతూ తనలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో బయటపెట్టారు. తనకు కాబోయే వాడికి దేవుడికి ఉన్నంత ఓపిక సహనం ఉండాలని ఈమె తెలిపారు.అరబిక్ బాయ్ ఫేస్ కట్ ఉండాలి.

తనని చేసుకోబోయే వాడు చాలా హైట్ ఉండాలి అంటూ తనకు కాబోయే భర్తలో ఉండే క్వాలిటీ పెట్టారు.ఈక్వాలిటీస్ ఉన్నటువంటి మగవాళ్ళు బయట ఎక్కడైనా కనపడితే తనకు పిచ్చలేస్తుందని అలాంటి వాళ్ళు వచ్చి తనకు ప్రపోజ్ చేస్తే తప్పకుండా ఓకే చెబుతానంటూ ఈ సందర్భంగా ఈమె పెళ్లి గురించి కాబోయే భర్త గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు