టీడీపీ, జనసేన వేర్వేరు పార్టీలు కాదని, అసలు జనసేన రాజకీయ పార్టీయే కాదని ఎద్దేవ చేశారు రాష్ట్ర మత్స్య పశు సంవర్ధకశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు( Sidiri Appalaraju )శ్రీకాకుళం జిల్లా పలాస లో ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి మాట్లాడుతూ టీడీపీకి జనసేన ఓ విభాగమని తాను ఎప్పట్నుంచో ఇదే అంశమై పలుమార్లు ప్రస్తావించినట్లు తెలిపారు.ఆయన మాట్లాడుతూ,చంద్రబాబు జైల్లో ఉంటే పవన్ కు ప్యాకేజీ ఎలా వస్తుందనే ఆలోచనలో ఉన్నట్లున్నారు.
చంద్రబాబు వంటి ఆర్ధిక ఉగ్రవాది దేశానికే ప్రమాదకరమని అభిప్రాయం వ్యక్తపరిచారు .జనసేన కార్యకర్తల నమ్మకాన్ని చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ అమ్మేసాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.జన సైనికులారా… మీ కష్టాన్ని.మీ లక్ష్యాన్ని.మీ ఆశయాన్ని చంద్రబాబు దగ్గర పవన్ కళ్యాణ్ తాకట్టు పెట్టారు.
చంద్రబాబు ను ఆరుస్ట్ చేస్తే లోకేష్ కన్నా పవన్ కళ్యాణ్ బాగా ఫీల్ అయ్యి రోడ్డు మీదకు వచ్చి హడావుడి అంతా ఇంతా కాదన్నారు.పవన్ కళ్యాణ్( Pawam kalyan ) ఏది నీ జెండా, ఎక్కడ వుంది నీ అజండా చెప్పాలన్నారు.
2019 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేయడం కూడా ఒక నాటకమేనని, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోవాలని ఉద్దేశంతోనే పోటీ చేశాడని అన్నారు.సిఎమ్ పోస్ట్ కి సిద్ధం అన్నావు పవన్ ఇప్పుడు చెప్పు సిఏం అభ్యర్థి ఎవరో? ఆది కూడా అధికారం లోకి వచ్చాక చెబుతావా? అని ప్రశ్నించారు.బాబుతో ప్యాకేజి మాట్లాడుకొని జన సైనికుల కష్టాన్ని, లక్ష్యన్ని, ఆశయాన్ని బాబుకి తాకట్టు పెట్టారని, చంద్రబాబు జైల్లో ఉంటే పవన్ కు ప్యాకేజి ఎలా వస్తుందనే ఆలోచనలో ఉన్నట్లు ఉన్నారని అన్నారు.
బాబు జైల్లో ఉంటే పవన్ కళ్యాణ్ కు ప్యాకేజి ఎలా వస్తుంది.చంద్రబాబు లాంటి ఆర్థిక ఉగ్రవాది ఈ రాష్టానికే కాకా దేశానికే ప్రమాదకరం.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎంతో కొంత ఉపాధి పొందారని అయితే ఐటీ ఉద్యోగులు చేస్తున్న ధర్నా అర్థరహితమని వ్యాఖ్యానించారు.2024 ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి, కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి పోటీ చేసిన, వేరు వేరుగా పోటీ చేసిన వైసిపీ పార్టీ ( YCP )స్వంతం గా పోటీ చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు.