వైరల్: పెగ్గేసిన అంకుల్.. అద్దం ముందు ఏం చేస్తున్నాడో చూడండి!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది.సాధారణంగా మందుబాబుల విన్యాసాలు గురించి జనాలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఫుల్లుగా తాగేసిన ప్రబుద్ధులు చాలామంది రోడ్లపై యోగాలు చేస్తూ ఉంటారు.అటువంటి వీడియోలు మనం అనేకం చూస్తూ ఉంటాము.

ఈ క్రమంలోనే ఓ వృద్ధుడు తన స్నేహితులతో కలిసి ఓ పార్టీకి వెళ్లి, మందు తాగుతూ ఎంజాయ్ చేసాడు.దీంతో మత్తు అతడి నషాళానికి ఎక్కింది.

ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే అసలు చిక్కు వచ్చింది.పార్టీలోంచి బయటికి వెళ్లే క్రమంలో అతను ఓ అద్దం ముందు ఆగాడు.

Advertisement

అద్దంలో తనని తాను చూసుకుని వేరే వ్యక్తి అనుకున్నాడేమో పాపం.ఇక్కడే పెద్ద జోక్ జరిగింది.

అతను ఏ పక్కకు తప్పుకున్నా అద్దంలో ప్రతిబింబం కూడా అటువైపే తిరుగుతుండడంతో వృద్ధుడు ఒకింత తికమక పడ్డాడు.బాగా మత్తులో ఉన్నాడేమో ఏమో గానీ, ఎదురుగా నిల్చున్న వ్యక్తి తనను ఆటపట్టిస్తున్నాడేమో అనుకుని తన ప్రతిబింబంపై( reflection ) తానే సీరియస్ అవుతాడు.ఈ నేపథ్యంలో తనతోనే తాను మాట్లాడుతూ.

‘‘నువ్వు పక్కకు తప్పుకొంటే.నేను వెళ్లిపోవాలి’’.

అంటూ తన ప్రతిబింబంపై ఆగ్రహం వ్యక్తం చేసాడు.ఇలా అతను చాలా సేపు అద్దం ముందు నిలబడి విచిత్రంగా ప్రవర్తిస్తూనే ఉంటాడు.

ఇన్స్టెంట్ గా గ్లోయింగ్ స్కిన్ ను పొందాలనుకుంటున్నారా.. అయితే ఇది ట్రై చేయండి!
ఏంటి లాస్య చివరికి ఇలా అయిపోయావు? ఫొటోస్ వైరల్

ఈ ఘటనను చూసి అక్కడున్న వారు పగలబడి నవ్వుకుంటూ, ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Advertisement

ఇంకేముంది, కట్ చేస్తే.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.దాంతో నెటిజన్లు వివిధ రకాలుగా ఆ వీడియోపై స్పందిస్తున్నారు.

‘‘మందు కొడితే మామూలుగా ఉండదు!’’.అంటూ కొందరు కామెంట్స్ చేస్తే, ‘‘ఈ అంకుల్ బంకులా తాగినట్టున్నాడు.

పీపా మొత్తం నిండిపోయి ఉంటుంది.పీక మొయ్య తాగితే ఇలాగే ఉంటుంది!’’.

అంటూ మరికొందరు కామెంట్స్ చేసారు.మరికొంత మంది వివిధ రకాల ఫన్నీ ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు.

కాగా ఈ వీడియో ప్రస్తుతం 5 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకొని పదివేలకు చేరువగా వెళుతోంది.లైక్స్ అయితే లెక్కేలేదు.

చూసిన ప్రతి ఒక్కరు దాదాపుగా లైక్ చేస్తున్నారు సదరు వీడియోని.మీరు కూడా ఓ లుక్కేసి జరా కామెంట్ పెట్టండి!.

తాజా వార్తలు