మానవ నిర్మిత జలమార్గాలైన కాలువలు నీటిపారుదలలో కీలక పాత్ర పోషిస్తాయి.లోతుగా, వెడల్పుగా ఉండే ఇరుకైన ఈ జలమార్గం మనుషులు నివసిస్తున్న ప్రదేశాల గుండా వెళ్తుంది.
అయితే ఇందులో అప్పుడప్పుడు ప్రమాదవశాత్తు కుక్కలు, పిల్లులు పడుతుంటాయి.కాలువలు చాలా లోతుగా ఉండటం వల్ల వాటిలో నుంచి అవి బయటపడలేవు.
ఎక్కువ కాలం కాలువలోనే ఉంటే వాటి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.తాజాగా అలాంటి ప్రమాదంలో ఒక పిల్లి ( Cat ) పడిపోయింది.
అయితే అదృష్టం కొద్దీ ఈ పిల్లిని గమనించిన ఒక వ్యక్తి దానిని కాపాడేందుకు ముందుకు వచ్చాడు.

అనంతరం ఒక తాడు,( Rope ) ఒక అట్టపెట్టాను జాయిన్ చేసి పిల్లిని కాపాడేందుకు( Save Cat ) ప్రయత్నించాడు.మొదటగా పిల్లి వద్దకు ఆ బాక్స్ ను( Box ) తాడు తోటి కిందికి దించాడు.ఆశ్చర్యకరంగా పిల్లి ఆ బాక్సు తనను రెస్క్యూ చేయడానికే కిందికి దించారని అర్థం చేసుకుంది.
వెంటనే ఆ బాక్స్ లోకి ఎక్కి అది కూర్చుంది.ఆ తర్వాత సదరు వ్యక్తి దానిని పైకి లాగాడు.
అంతే అది వెంటనే పైకి వచ్చేసింది.ఆపై అక్కడ నుంచి వెళ్ళిపోయింది.
ఆ సమయానికి దాని శరీరం బాగా తడిసింది.ఇంకాస్త సమయం ఉంటే దాని బాడీ టెంపరేచర్ మరింత పడిపోయి ప్రాణాలకే ముప్పు కలిగేది.
లక్కీగా ఈ వ్యక్తి మంచి మనసు చేసుకొని దానిని కాపాడాడు.

ఈ రెస్క్యూకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇది చూసి చాలామంది ఎమోషనల్ అవుతున్నారు.మానవత్వం ఇంకా మిగిలే ఉందని కామెంట్ చేస్తున్నారు.ఇలాంటి వారు ఈ ప్రపంచానికి కావాలని వ్యాఖ్యానిస్తున్నారు.కష్టాల్లో ఉన్న మూగజీవులను( Animals ) కాపాడే వాడే అసలైన హీరో అని కామెంట్లు పెడుతున్నారు.ఈ హార్ట్ టచింగ్ వీడియోను @ buitengebieden అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.దీనికి ఇప్పటికే 10 లక్షలు పైగా వ్యూస్ వచ్చాయి.
ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.







