యువకుడిపై కుక్కలు మూకుమ్మడి దాడి.. ఎలా ఎస్కేప్ అయ్యాడో చూస్తే..!

సాధారణంగా ఏదైనా కుక్క కరవడానికి ఉరికొస్తే గుండెలు జారిపోతాయి.ఆ సమయంలో చాలామంది పరిగెత్తడమో లేదా బాగా భయపడిపోయి అలాగే నిల్చొవడమో చేస్తుంటారు.

 See How A Boy Escapes From Dogs Attack Details, Men, Attack, Viral Latest, Viral-TeluguStop.com

కొందరు ధైర్యం చేసి వాటిని ఎదుర్కొంటారు.అయితే తాజాగా ఒక యువకుడిని ఏకంగా 8 కుక్కలు చుట్టుముట్టాయి.

నలుదిక్కుల నుంచి దాడి చేయడానికి తెగబడ్డాయి.అయితే అతడు మాత్రం కొంచెం కూడా భయపడలేదు.

క్షణాల్లోనే అప్రమత్తమై ఈ యువకుడు తన ముందున్న కర్ర తీసుకుని ఏదో సూపర్ హీరోలాగా వాటితో ఫైట్ చేయడం స్టార్ట్ చేశాడు.

కాలు పట్టేయడానికి 8 కుక్కలు ఒకేసారి ముందుకు రాగా అతడు గుండ్రంగా తిరుగుతూ కుక్కల్ని బయటపెట్టాడు.

అవి కరవడానికి ప్రయత్నించాయి కానీ అతడు సూపర్ ఫాస్ట్ గా అన్నిటినీ సింగిల్ హ్యాండ్ తో హ్యాండిల్ చేశాడు.అనంతరం చాలా తెలివిగా ఎస్కేప్ అయ్యాడు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది.దీనికి ఇప్పటికే 50 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.ఈ యువకుడి ధైర్యాన్ని చూసి మరికొంతమంది అవాక్కవుతున్నారు.సాధారణంగా కుక్కలు ఫేస్ టు ఫేస్ దాడి చేయలేవు.ఎప్పుడైతే వెనక్కి తిరిగామో లేదా పరిగెత్తామో అప్పుడే ఇవి కరిచేస్తాయి.కొన్ని కుక్కలు ముందు నుంచి కూడా దాడి చేస్తాయి.ఇలాంటప్పుడు ఒక కర్ర తీసుకొని వాటిని భయపెట్టాలి.

కొందరు ఆకతాయిలు కావాలనే కుక్కల జోలికి వెళ్తారు.అప్పుడు కూడా ఇవి కరిచేస్తుంటాయి.

అందుకే వీటితో జాగ్రత్తగా ఉండటం మంచిదని పెద్దలు కూడా చెబుతుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube