అక్కడ ప్రయాణికుల భద్రత గాలికి వదిలేశారు!

ఇప్పుడు ఏ ప్రభుత్వం మీ ప్రాణం కాపాడలేదు.మీ ప్రాణం మీకు ముఖ్యం అయితే మీరు తప్పనిసరిగా కోవిడ్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

మాస్కు ధరించాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి, శానిటైజర్ ఉపయోగించుకోవాలి.అప్పుడే మీరు కోవిడ్ బారిన పడరు.

లేదంటే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు.ఎందుకు ఇలా చెప్తున్నారు అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.తెలంగాణలోని సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో కొవిడ్‌ జాగ్రత్తలతో పాటు ప్రయాణికుల భద్రతపై కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు.

శానిటైజర్ కనిపించడం లేదు, థర్మల్‌ స్ర్కీనింగ్‌ పని తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నిజానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు ఎటువంటి కోవిడ్ ఆంక్షలు లేకుండా నేరుగా రైలు వద్దకు వెళ్లిపోతున్నారు.

Advertisement

లగేజీ చెకింగ్‌ థర్మల్‌ స్ర్కీనింగ్‌ పని చెయ్యడం లేదు.దీంతో ప్రయాణికులు డైరెక్ట్ గా వెళ్తున్నారు.సాధారణంగా అయితే కొన్ని స్టేషన్లలో వ్యక్తిపై, అతని లగేజిపై శానిటైజర్‌, డిజిన్ఫెక్టెంట్‌ జల్లుతారు.

కానీ ఇక్కడ అవి ఏమి లేవు.అంతే కాదు అంతమంది ప్రయాణికులు వెళ్తున్న వస్తున్న ఆ స్టేషన్ లో పోలీసులు కూడా కరువయ్యారు.

ఎక్కడో ఒకచోటా ఉండాలంటే ఉండాలి అనేలా పోలీసులు ఉన్నారు.కాగా రైల్వే స్టేషన్ లో విచారణ కౌంటర్లు మూసివేయడంతో దూర ప్రాంతాలకు వెళ్లే వారు ఒక్కోసారి ఇబ్బందులకు గురవుతున్నారు.

వాళ్లకు క్షమాపణలు చెప్పిన సంక్రాంతికి వస్తున్నాం బుల్లిరాజు.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు