సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించింది.ఈ మేరకు కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నారాయణ శ్రీ గణేశ్( Narayana Shri Ganesh ) పేరును అధిష్టానం అధికారికంగా వెల్లడించింది.
ఈ నేపథ్యంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రెస్ నోట్ ను విడుదల చేశారు.అయితే గణేశ్ ఇటీవలే బీజేపీ నుంచి కాంగ్రెస్ గూటికి చేరారన్న సంగతి తెలిసిందే.
కాగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డుప్రమాదంలో మృతిచెందారు.దీంతో ఆ స్థానం ఖాళీ కావడంతో ఉపఎన్నిక అనివార్యమైంది.