తెలంగాణ బీజేపీ నేతలు రహాస్యంగా సమావేశం అయ్యారని తెలుస్తోంది.ఈ భేటీలో వివేక్, విజయశాంతి, సురేశ్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, ఏనుగు రవీందర్ తదితరులు పాల్గొన్నారని సమాచారం.
రాష్ట్ర బీజేపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యవహార శైలి మరియు చేరికల అంశంపై కూడా చర్చించారని తెలుస్తోంది.
హైదరాబాద్ టూర్ లో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొంతమంది నేతలను కలవడంపై కొంత అసంతృప్తిలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.ఈటలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నియోజకవర్గాల్లో చేరికలపై సీనియర్లను సంప్రదించకపోవడంపై వీరంతా అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో వీరి భేటీ చర్చనీయాంశంగా మారింది.