ఐపీఎల్ లో ( IPL ) ప్రతి టీం కూడా తనదైన రీతిలో మంచి విజయాలను అందుకుంటు ముందుకు దూసుకెళ్తుంది.ఇక ఇలాంటి క్రమంలో “లక్నో సూపర్ జాయింట్స్”( Lucknow Super Giants ) టీమ్ మాత్రం మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన కూడా చాలా తొందరగానే తమ టీం రికవరీ అయినట్టుగా కనిపిస్తుంది.
ప్రస్తుతం వరుసగా మూడు మ్యాచ్ ల్లో విజయం సాధించి ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ గుండెల్లో గుబులు పుట్టిస్తుందనే చెప్పాలి.
ఇక ఇదిలా ఉంటే గత రెండు మ్యాచ్ ల్లో మయాంక్ యాదవ్( Mayank Yadav ) అద్భుతమైన స్పెల్ వేస్తూ టీం కి గొప్ప విజయం అందించగా ఇక నిన్న టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జాయింట్స్ టీం భారీ విక్టరీని సాధించింది.ఇక ఈ టీం లో ‘యశ్ ఠాగూర్’( Yash Thakur ) అద్భుతమైన బౌలింగ్ చేసి గుజరాత్ టైటాన్స్( Gujarat Titans ) ప్లేయర్ల వెన్ను లో వణుకు పుట్టించాడనే చెప్పాలి.ఇక అత్యుత్తమమైన బౌలింగ్ పర్ఫామెన్స్ తో గుజరాత్ టైటాన్స్ బ్యాట్స్ మెన్స్ ను మట్టికరిపించాడు.
ఈ మ్యాచ్ లో తను ఐదు వికెట్లు తీసి ఒక సరికొత్త రికార్డును కూడా క్రియేట్ చేశాడు.ఇక దీంతో ఆయన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
ఇక లక్నో మంచి టీం అయినప్పటికీ ఆ టీమ్ లో ఉన్న వీక్నెస్ పాయింట్ ఏంటంటే ప్లేయర్లందరూ కన్సిస్టెన్సీ తో ఆడలేరు అనే ఒక అపవాదైతే మొదటినుంచి ఆ టీమ్ మోసుకుంటూ వస్తుంది.
మరి ఈ క్రమంలో ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్ చూసినట్లయితే టీమ్ లో చాలా మార్పులు జరగడమే కాకుండా ప్లేయర్లు కూడా చాలా అనుకూలమైన పరిస్థితిలను చవి చూస్తున్నారు.ఇక ప్రతికూల పరిస్థితుల్లో కూడా మ్యాచ్ ను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు.మరి ఇలాంటి క్రమంలో గత రెండు సీజన్ల ల్లో సెమీఫైనల్ కి వచ్చి వెనుతిరిగిన లక్నో సూపర్ జాయింట్స్ టీమ్ ఈసారి ఛాంపియన్స్ గా నిలువబోతున్నారు.
అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.ఇక లక్నో సూపర్ జాయింట్స్ హవాతో ఇలాగే ఈ సీజన్ అయిపోయెంతా వరకు ఇలానే కొనసాగుతుందా లేదా అనేదితెలియాల్సి ఉంది…