చౌటుప్పల్ మండలం మందోళ్లగూడెం గ్రామంలో యాదవ,కురుమలకు శుక్రవారం మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ చైర్మన్ దుదిమెట్ల బాలరాజు యాదవ్ తో కలిసి లబ్దిదారులకు రెండవ విడత గొర్రెల పంపిణీ చేశారు.గొర్రెలతో పాటు వాటి ఫీడ్ ను కూడా అందచేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… మందోళ్లగూడెం గ్రామంలో రెండవ విడత గొర్రెల పంపిణి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా వుందని,మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 93 కోట్ల రూపాయలు లబ్దిదారుల అకౌంట్లో వేయడం జరిగిందన్నారు.లబ్ధిదారులే నేరుగా వెళ్లి గొర్రెలు కొనుక్కునే విధంగా వెసులుబాటు కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదములు తెలిపారు,ప్రతి ఒక్క లబ్ధిదారులకు 1,58000 రూపాయలు అకౌంట్లో వేయడం జరిగిందని,మీకు నచ్చిన గొర్రెలను తెలంగాణాలో కాకుండా వేరే ఏ రాష్ట్రం నుండి అయినా తెచ్చుకోవచ్చని తెలియచేసారు.
వేరే ఏ ఇతర రాష్టాలలో ఈ విధంగా యాదవ మరియు కురుమ సోదరులకు ఇలాంటి స్కీమ్ లు లేవని, యాదవులు ఆర్ధికంగా అభివృద్ధి చెందాలనే కేసీఆర్ ఇలాంటి స్కీమ్ లను తీసుకవచ్చారని, గొర్రెల యూనిట్లను ఇతర రాష్ట్రంల నుండి తీసుకవచ్చే సమయంలో అధికారులు పారాదర్శకంగా పని చేయాలిని సూచించారు.తెలంగాణ రాష్టంలో ప్రతి ఒక్కరూ ఆర్ధికంగా ఎదగాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలొ పలువురు ప్రజాప్రతినిధులు,యాదవ మరియు కురుమ నాయకులు,అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.







