యాదాద్రి జిల్లా:భువనగిరి మండలం రాయగిరి గ్రామానికి చెందిన బల్ల లింగప్ప అనే కిరాణా షాపు యజమాని కిచకత్వం గురువారం వెలుగు చూసింది.వివరాల్లోకి వెళితే రాయగిరి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల పక్కనే లింగప్ప వాసవి కిరాణం షాపు నడుపుతున్నాడు.
కిరాణా షాపుకు వచ్చే పాఠశాల బాలికలను చాక్లెట్లు ఇస్తానని ఆశ చూపి కిరాణం షాపు వెనుకకు తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించడంతో అతని ప్రవర్తన పట్ల విసుగు చెందిన చిన్నారులు పేరెంట్స్ కి చెప్పడంతో ఆ కీచక వ్యాపారి బాగోతం బట్టబయలైంది.విషయం తెలుసుకున్న స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
పాఠశాలకు అతి సమీపంలో కిరాణా షాపు ఉండడంతో పాఠశాలలో చదువుకునే బాలికలు పుస్తకాలు,పెన్నులు,ఇతర అవసరాల కోసం కిరాణా షాప్ కి వెళ్లేవారు.గతంలో కూడా ఇలాగే ఆడపిల్లలకు చాక్లెట్స్ ఇస్తానని ఆశచూపి అసభ్యంగా ప్రవర్తించేవాడని అతనిపై ఆరోపణలు ఉన్నాయి.