సోషల్ మీడియాలో నిత్యం కొన్ని లక్షల వీడియోలు అప్లోడ్ అవుతూ ఉంటాయి.అయితే అందులో అతి కొద్ది వీడియోలు మాత్రమే నెటిజన్లను ఆకట్టుకుంటాయి.
స్మార్ట్ ఫోన్స్ విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో సోషల్ మీడియాకి మంచి గిరాకీ ఏర్పడిందని చెప్పవచ్చు.ఇకపోతే ఇండియాలో ప్రతిభకు కొదవలేదని నిరూపించే ఎన్నో ఘటనలు జరగగా, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని గమనిస్తే అది నిజమే కదా అని అనిపించక మానదు.
ఇకపోతే ఈ క్రమంలో కొందరు రాత్రికి రాత్రి సెలబ్రిటీలుగా మారిపోయారు కూడా.

తాజాగా మరో మట్టిలో మాణిక్యం నెట్టింట ప్రత్యక్షమయ్యాడు.అవును, ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియోలో ఓ వ్యక్తి ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించడం గమనించవచ్చు.
అతని చేతిలో ఓ మైక్ వుండగా ఆ మైక్‌లో తాను వచ్చినట్టుగా అందరికీ సూచిస్తూ ఎనౌన్స్ చేస్తున్నాడు.ఈ క్రమంలో అతను మధ్య మధ్యలో పాటలు పడటం విశేషం అని చెప్పుకోవాలి.
అయితే ఇక్కడే అతనిలో అద్భుత గాయకుడు ఉన్నాడనే విషయం మనం గమనించవచ్చు.

అవును, అతను 2003లో వచ్చిన సల్మాన్ ఖాన్ మూవీ తేరే నామ్‌లోని సూపర్ హిట్ సాంగ్ ‘క్యోం కిసీ కో’ పాటను ఎంతో శ్రావ్యంగా పాడటం ఇపుడు అక్కడి స్థానికులనే కాకుండా, నెటిజన్లను కూడా ఆశ్చర్యపోయేలా చేసింది.ఈ సినిమాలోని పాటలు అప్పట్లో ఎంతో పాపులర్ అయ్యాయో అందరికీ తెలిసిన విషయమే.ఈ వీడియోను ఆ సినిమా డైరెక్టర్ సతీష్ కౌశిక్ సోషల్ మీడియాలో షేర్ చేయడం విశేషం.20 ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమాలోని పాటలపై అంతే ప్రేమ చూపించండం గర్వంగా ఉందంటూ ఆ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.







