అయ్యో.. గీత గోవిందం జోడీ మళ్లీ కనిపించడం కష్టమే!

విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన గీత గోవిందం సినిమా ఎంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే.రూ.100 కోట్ల కు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఆ సినిమా ఇప్పటికి కూడా ప్రేక్షకులు యొక్క అభిమానం సొంతం చేసుకుంటూనే ఉంటుంది.టీవీల్లో టెలికాస్ట్ అయినప్పుడు గీత గోవిందం యొక్క రేటింగ్ భారీగా నమోదు అవుతూ ఉంటుందని బుల్లి తెర వర్గాల వారు మాట్లాడుకుంటూ ఉంటారు.

 Vijay Devarakonda Geeta Govindam Sequel Not Happening , Vijay Devarakonda, Paras-TeluguStop.com
Telugu Allu Aravind, Geeta Govindam, Parashuram-Movie

అలాంటి గీత గోవిందం సినిమా కు సీక్వెల్ రాబోతుంది అంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి.దర్శకుడు పరశురాం ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నాడని కూడా వార్తలు రావడం జరిగింది. గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా గీత గోవిందం సినిమా నిర్మాణం జరిగిన విషయం తెలిసిందే.పరశురాం మళ్ళీ అదే నిర్మాణం లో గీత గోవిందం యొక్క సీక్వెల్ కి వర్క్ చేయాల్సి ఉంది.

కానీ ఇటీవల అల్లు అరవింద్ మరియు పరశురాం మధ్య విభేదాలు తలెత్తాయి.దాంతో విజయ్ దేవరకొండ హీరో గా దిల్ రాజు నిర్మాణం లో పరుశురాం సినిమా అధికారికంగా ప్రకటించారు.

Telugu Allu Aravind, Geeta Govindam, Parashuram-Movie

ఆ సమయం లో అల్లు అరవింద్ ఏకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి పరశురాం పై తీవ్ర వ్యాఖ్యలు చేయాలని భావించాడు.తన వద్ద అడ్వాన్స్ తీసుకొని స్క్రిప్ట్ కూడా రెడీ చేసి ఇప్పుడు దిల్ రాజు బ్యానర్ లో సినిమా ను చేసేందుకు పరిష్కారం రెడీ అయ్యాడు అంటూ అల్లు అరవింద్ సన్నిహితుల వద్ద ఆరోపించాడు.ఈ వివాదం కాస్త పెద్దగానే అయింది.అందుకే గీత గోవిందం యొక్క సీక్వెల్ ఉండక పోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.అల్లు అరవింద్ తో కలిసి పరశురాం మళ్ళీ వర్క్ చేసే అవకాశాలు దాదాపు లేవని అనిపిస్తుంది.అందుకే గీత గోవిందం యొక్క సీక్వెల్ ఉండక పోవచ్చు.

అయితే విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన కాంబినేషన్ లో సినిమాలు మాత్రం వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube