Rodinia Black diamond : ఈ బ్లాక్ డైమండ్ నింగి నుంచి పడినదేనని శాస్త్రవేత్తలు వెల్లడి.. దాని విశేషాలు ఇవే!

ఆకాశం పైనుంచి ఊడిపడిన ఒక బ్లాక్ డైమండ్‌కి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ డిమాండ్ నెలకొంది.దీన్ని దక్కించుకునేందుకు కుబేరులు క్యూ కడుతున్నారు.

ఆకాశం పైనుంచి నిజంగా డైమండ్ పడుతుందా అని సందేహించనక్కర్లేదు.ఎందుకంటే, ఇటీవల శాస్త్రవేత్తలు ఈ బ్లాక్ డైమండ్ భూమికి సుదూరంగా ఉన్న ఒక విశ్వంలోని ప్రాంతం నుంచి పడినట్లు పక్కా ఆధారాలతో తేల్చారు.

అందుకే దీనికి ఇంత డిమాండ్.సాధారణంగా భూమిపై దొరికే వజ్రాలకే అత్యధిక డిమాండ్ ఉంటుంది.

ఇది ఆకాశం పైనుంచి పడింది కాబట్టే దీనికి మరింత డిమాండ్ ఏర్పడింది.శాస్త్రవేత్తల ప్రకారం, కొన్ని ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులలో ఉల్కలు, గ్రహశకలాలు భూమిని ఢీ కొట్టినప్పుడు ఈ బ్లాక్‌ డైమండ్స్‌ ఏర్పడతాయి.

Advertisement

అది కూడా చాలా అరుదుగా ఏర్పడతాయట.అలా ఎందుకు ఏర్పడతాయనే దాని వెనక కారణాలను శాస్త్రవేత్తలు కనిపెట్టడానికి పరిశోధనలు చేస్తున్నారు.

శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం కోట్ల ఏళ్ల క్రితం రెండు ఖండాలు కనెక్ట్ అయ్యాయట.అప్పుడే రోడినియా అనే ఒక సూపర్ కంటినెంట్ ఏర్పడిందట.

అది ఏర్పడే సమయంలోనే అరుదైన డైమండ్స్ భూమి మీద పడ్డాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.ఈ ప్రపంచంలో ఎన్నో ఖండాలు ఈ బ్లాక్ డైమండ్స్ ఎక్కువగా సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, బ్రెజిల్ ప్రాంతాలలోనే దొరకడం విశేషం.

ఈ రేర్ డైమండ్ ఆక్షన్ త్వరలోనే నిర్వహించడం ఉండగా దీని ధర ఎంత పలుకుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఈ డైమండ్ అత్యంత అరుదైనదే కాదు అత్యంత సహజ సిద్ధమైనది కూడా.సో నింగి నుంచి పడిన డైమండ్ అనే ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి దీనిని కొనేందుకు కుబేరులు ఎంత డబ్బైనా వెచ్చించేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.

పర్షియన్ కార్పెట్ లాంటి కేక్ ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే ఫిదా..
Advertisement

తాజా వార్తలు