ఈ విశ్వం ఒక విస్తారమైన, ఆసక్తికరమైన, భయంకరమైన ప్రదేశం.ఈ విశ్వంలో మానవులకి తెలియని ఎన్నో రహస్యాలు దాగున్నాయి.
ఈ ఖగోళ రహస్యాలను బయట పెట్టేందుకు అన్వేషణ ప్రారంభించి ఒక శతాబ్దం కూడా గడిచిపోలేదు.కాగా ఇప్పటికే గెలాక్సీలో ఆల్రెడీ మనకి తెలిసిన గ్రహాల వంటి అనేక గ్రహాలు బయటపడ్డాయి.
వీటిలో GJ 1252 b అని పిలిచే ఒక గ్రహం ఉంది.ఇది అచ్చం భూమి లాగానే కనిపిస్తుంది.
కాకపోతే ఈ సూపర్-ఎర్త్ గ్రహానికి బంగారాన్ని కరిగించేంత అధిక ఉపరితల ఉష్ణోగ్రత ఉంటుంది.
తాజాగా ఖగోళ శాస్త్రవేత్తలు భూమి-పరిమాణ రాతి ఎక్సోప్లానెట్ GJ 1252 b చాలా వేడిగా ఉందని, దానికి వాతావరణం ఉండకపోవచ్చని తెలిపారు.
ద్వితీయ గ్రహణంలోకి ప్రవేశించినప్పుడు సూపర్-ఎర్త్ ఇన్‌ఫ్రారెడ్ రేడియేషన్‌ను కొలవడానికి ఖగోళ శాస్త్రవేత్తల బృందం ఇప్పుడు రిటైర్డ్ అయిన స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్‌ను ఉపయోగించింది.ఒక గ్రహం దాని నక్షత్రం వెనుకకు వెళ్ళినప్పుడు ద్వితీయ గ్రహణం సంభవిస్తుంది.
నాసా ప్రకారం, GJ 1252 b గ్రహం పగటి ఉష్ణోగ్రతలు 1,228 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్నాయని బృందం కనుగొంది.

ఈ ఉష్ణోగ్రతలు బంగారం, వెండి, రాగి గ్రహం ఉపరితలంపై కరిగిపోయేంత వేడిగా ఉంటాయి.ఇక ఈ ఉష్ణోగ్రతలలో మనిషి అడుగుపెడితే క్షణాల్లోనే మసి అయిపోతారు.GJ 1252 b అనేది 2020లో కనుగొనబడిన రాతి, భూసంబంధమైన ఎక్సోప్లానెట్.ఇది భూమి కంటే పెద్దది, అలానే భూ గ్రహం కంటే 1.18 రెట్లు పెద్ద వ్యాసార్థంతో ఉంటుంది.ఈ మండుతున్న ఎక్సోప్లానెట్ భూమికి 65 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.