టైమ్ ట్రావెల్( Time Travel ) కాన్సెప్ట్ ఎల్లప్పుడూ ప్రజలలో ఆసక్తిని రగిలిస్తుంటుంది.ఈ సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో ఇప్పటికే ఎన్నో నవలలు సినిమాలు వచ్చి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.
టైమ్ ట్రావెల్ అంటే సమయం ద్వారా భవిష్యత్తు, భూతకాలంలోకి వెళ్లడం. H.G.వెల్స్ రచించిన “ది టైమ్ మెషిన్” అనే ఒక పుస్తకం చాలామందిని ఆకట్టుకుంది.కొంతమందిని టైమ్ మెషిన్ కనిపెట్టేలా ఇది ప్రేరేపించింది
కూడా.అలాంటి వ్యక్తులలో రాన్ మాలెట్( Ron Mallett ) అనే శాస్త్రవేత్త ఒకరు.
ఆస్ట్రోఫిజిక్స్ ప్రొఫెసర్ అయిన మాలెట్ తన పదేళ్ల వయసులో తన తండ్రి మరణంతో తీవ్రంగా ప్రభావితమయ్యాడు.

అతని తండ్రి సైన్స్‌ని బాగా ఇష్టపడేవాడు, అతని కొడుకుకు ఈ అభిరుచిని అందించాడు.తండ్రి మరణం తరువాత, మాలెట్ సైన్స్ పుస్తకాలు చదువుతూ పెరిగాడు.సమయాన్ని అర్థం చేసుకోవడానికి నిశ్చయించుకున్నాడు.
మళ్లీ తన తండ్రిని చూసేందుకు టైమ్ మెషీన్‌ను( Time Machine ) తయారు చేయాలనుకున్నాడు.మాలెట్ టైమ్ ట్రావెల్ ఫార్ములాను రూపొందించడానికి బ్లాక్ హోల్స్, ఐన్‌స్టీన్ సిద్ధాంతాలను అధ్యయనం చేస్తూ సంవత్సరాలు గడిపాడు.
సాధారణంగా బ్లాక్ హోల్స్ అంతరిక్షంలో గురుత్వాకర్షణ ఉన్న ప్రాంతాలు కాబట్టి అవి ప్రతిదానిని తమలోకి లాగేసుకుంటాయి, చివరికి కాంతిని కూడా లాగుతాయి.

ఐన్‌స్టీన్ సిద్ధాంతాలు వేగం ద్రవ్యరాశి, సమయం, స్థలాన్ని ఎలా మారుస్తుందో వివరిస్తాయి.కొద్దిపాటి ద్రవ్యరాశి చాలా శక్తిగా మారుతుందని చెబుతున్నాయి.ఇది ప్రముఖ ఈక్వేషన్ E = mc^2లో కూడా నిరూపితమైంది.
టైమ్ మెషీన్ కోసం మాలెట్ ఆలోచన కాంతిని ఉపయోగించడం.అతను బ్లాక్ హోల్( Black Hole ) ఎలా పనిచేస్తుందో అదే విధంగా స్థలం, సమయాన్ని ట్విస్ట్ చేయడానికి లేజర్ల వృత్తాన్ని ఉపయోగించాలనుకుంటున్నాడు.
ఇది సిద్ధాంతపరంగా టైమ్ ట్రావెల్‌ను అనుమతిస్తుందని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు.