కరోనా ఆ పేరు వినగానే ప్రజలందరూ ఒక పీడ కలలా ఫీలవుతారు.ఎందుకంటే ఈ కరోనా వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా తొమ్మిది నెలల పాటు లాక్ డౌన్ ప్రకటించారు.
ఈ లాక్ డౌన్ లో ఎంతోమంది తినడానికి తిండి లేక చాలా అవస్థలు పడ్డారు.ఇటు పిల్లలకు స్కూల్స్, పెద్దవారికి ఆఫీసులు ఇలా ఎవరు ఏమి పని చేయకుండా తొమ్మిది నెలల పాటు ఇంటికి పరిమితమయ్యారు .తర్వాత వచ్చిన కొన్ని సడలింపు ల వల్ల ఎవరి పనులకు వారు వెళ్లి చేసుకుంటున్నారు.
ఇక ఈ లాక్ డౌన్ నేపథ్యంలో విద్యార్థులకు చదువులు కూడా దూరం అయ్యాయి.
చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు కరోనా కారణంగా స్కూల్ కి వెళ్ళ కూడదు అని ఉపాధ్యాయులు పిల్లలకి ఆన్లైన్లో క్లాసులు నిర్వహిస్తున్నారు.ఈ ఆన్లైన్ క్లాసుల ద్వారా పిల్లలకి ఆ రోజు స్కూల్ లో జరగవలసిన పాఠాలు నేర్పుతున్నారు.
అలాగే ఎంత మంది స్టూడెంట్స్ ఆన్లైన్ క్లాసెస్ కి అటెండ్ అయ్యారుతెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు ఆన్లైన్ క్లాస్ లోనే అటెండెన్స్ వేసుకుంటున్నారు.ఇదిలా ఉండగా ఆన్లైన్ క్లాసులో ఒక విద్యార్థి టీచర్ ని బురిడీ కొట్టించాడు.

ఇక విషయంలోకి వెళితే కరోనా నేపథ్యంలో పలు విద్యా సంస్థలు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి.అయితే కొందరు చిన్నారులు ఆన్లైన్ క్లాసెస్ లో అడిగే ప్రశ్నలు మరియు వారు ఇచ్చే హోంవర్క్ నుంచి ఎలా తప్పించుకోవాలి అని ప్రయత్నిస్తుంటారు.ఒక విద్యార్థి జూమ్ క్లాస్ కి అటెండ్ అయిన ప్రతి సారి తన పేరు మార్చాడు.టీచర్ అడిగే హోంవర్క్, ప్రశ్నలు నుంచి తప్పించుకోసాగాడు.అయితే కొన్ని వారాల తరువాత ఈ విషయాన్ని ఉపాధ్యాయురాలు పసిగట్టింది.ఈ విషయాన్ని ఉపాధ్యాయురాలు తన భర్తతో చెప్పగా అతను ఫన్నీగా ట్వీట్ చేశారు.
ఆ విద్యార్థి తన చదువు గురించి భయపడాల్సిన పనిలేదు.ఎందుకు అంటే అతను ఇప్పటికే మంచి మేధావి అని పేర్కొన్నారు.సోషల్ మీడియాలో వైరల్ అయినా ఈ ట్వీట్ పై పలువురు నెటిజన్లు స్పందించారు.ఆన్లైన్ క్లాసులు సందర్భంగా తమ పిల్లల చిలిపి అల్లరి చేష్టలను ప్రస్తావించారు.
ఈతరం పిల్లలకు తెలుగు ఎక్కువ.అందుకు టీచర్ ఒక అడుగు ముందు గానే ఉండాలి అని ఒకరు వ్యాఖ్యానించారు.