రాజ్యసభ ఎన్నికలకు( Rajya Sabha elections ) షెడ్యూల్ విడుదల అయింది.ఈ మేరకు మొత్తం 15 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం( Central Election Commission ) షెడ్యూల్ విడుదల చేసింది.
15 రాష్ట్రాల్లో మొత్తం 56 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి.వీటిలో తెలంగాణ( Telangana )లో 3 స్థానాలు, ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలను నిర్వహించనున్నారు.కాగా వచ్చే నెల 8వ తేదీన ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది.అలాగే 27న ఎన్నికలకు పోలింగ్ జరగనుండగా అదే రోజు కౌంటింగ్ నిర్వహించనున్నారు.కాగా నామినేషన్ల దాఖలుకు వచ్చే నెల 15 వరకు గడువు ఉంది.అలాగే ఫిబ్రవరి 16న నామినేషన్లను పరిశీలించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.