బస్సులో నాగుపాము.. చూసిన డ్రైవర్ ఏం చేశాడంటే?

పాములు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి.అయితే వాటితో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.

 Scary Moment For Bus Driver Snake Found Under The Accelerator Driver Gets Down T-TeluguStop.com

ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.వాటి కోరలతో దాడి చేస్తాయి.

రెప్పపాటులో కాటు వేస్తాయి.అయితే పాములు విషయం లేనివి, విషం ఉన్నవి ఉంటాయి.

నాగు పాముల్లో విషం ఉంటుంది.ఈ పాములే మనకు చాలా తరచూగా కనిపిస్తాయి.

చిన్న సైజు నుండి పెద్ద పరిమాణం వరకు నాగు పాములు కనిపిస్తుంటాయి.అలాగే ఓ బస్సు డ్రైవర్ కు కూడా పాము కనిపించింది.

పాము కనిపించడం కూడా వార్తేనా అనుకోవద్దు.ఎందుకంటే ఆ బస్సు డ్రైవర్ కు పాము కనిపించిన సమయంలో అతడు డ్రైవింగ్ లో ఉన్నాడు.

ఆ.ఉంటే పాము కనిపిస్తే ఏమవుతుంది.అంటారా.అక్కడికే వస్తున్నాం ఆగండి.

అతడు బస్సు డ్రైవ్ చేస్తున్నాడు.ఎప్పట్లాగే తన డ్యూటీ నిర్వర్తిస్తున్నాడు.

ఉన్నట్టుండి కాలు దగ్గర ఏదో కదులుతున్నట్లుగా అనిపించింది.ఏంటా అని చూస్తే పాము ఉంది.

కాళ్ల వద్ద బ్రేకు పడెల్ కింద నక్కి ఉంది పాము.బ్రేకు వేద్దామంటే ఎక్కడ పాము కాటేస్తుందోనన్న భయం. పోనీ బ్రేకులు వేయకుండా బస్సును నడపడం చాలా కష్టం.అప్పుడే ఆ డ్రైవర్ ఎంతో చాక చక్యంగా వ్యవహరించాడు.

బస్సు ఇంజిన్ ను ఆఫ్ చేశాడు.బస్సును నెమ్మదిగా స్లో చేశాడు.

ప్రయాణికులకు ఇదంతా ఏమీ తెలియదు.బస్సును రోడ్డు పక్క ఆపి ఆ తర్వాత ప్రయాణికులకు కంగారు పడవద్దని చెప్పి దింపేశాడు.

ఆ తర్వాత బస్సు నుండి ఆ పామును కర్రతో బయటకు తీసి వదిలిపెట్టాడు.ఈ ఘటన కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా కొప్పా తాలూక జయపుర గ్రామంలో జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube