బస్సులో నాగుపాము.. చూసిన డ్రైవర్ ఏం చేశాడంటే?

పాములు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి.అయితే వాటితో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.

ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.వాటి కోరలతో దాడి చేస్తాయి.

రెప్పపాటులో కాటు వేస్తాయి.అయితే పాములు విషయం లేనివి, విషం ఉన్నవి ఉంటాయి.

నాగు పాముల్లో విషం ఉంటుంది.ఈ పాములే మనకు చాలా తరచూగా కనిపిస్తాయి.

చిన్న సైజు నుండి పెద్ద పరిమాణం వరకు నాగు పాములు కనిపిస్తుంటాయి.అలాగే ఓ బస్సు డ్రైవర్ కు కూడా పాము కనిపించింది.

పాము కనిపించడం కూడా వార్తేనా అనుకోవద్దు.ఎందుకంటే ఆ బస్సు డ్రైవర్ కు పాము కనిపించిన సమయంలో అతడు డ్రైవింగ్ లో ఉన్నాడు.

ఆ.ఉంటే పాము కనిపిస్తే ఏమవుతుంది.

అంటారా.అక్కడికే వస్తున్నాం ఆగండి.

అతడు బస్సు డ్రైవ్ చేస్తున్నాడు.ఎప్పట్లాగే తన డ్యూటీ నిర్వర్తిస్తున్నాడు.

ఉన్నట్టుండి కాలు దగ్గర ఏదో కదులుతున్నట్లుగా అనిపించింది.ఏంటా అని చూస్తే పాము ఉంది.

కాళ్ల వద్ద బ్రేకు పడెల్ కింద నక్కి ఉంది పాము.బ్రేకు వేద్దామంటే ఎక్కడ పాము కాటేస్తుందోనన్న భయం.

పోనీ బ్రేకులు వేయకుండా బస్సును నడపడం చాలా కష్టం.అప్పుడే ఆ డ్రైవర్ ఎంతో చాక చక్యంగా వ్యవహరించాడు.

బస్సు ఇంజిన్ ను ఆఫ్ చేశాడు.బస్సును నెమ్మదిగా స్లో చేశాడు.

ప్రయాణికులకు ఇదంతా ఏమీ తెలియదు.బస్సును రోడ్డు పక్క ఆపి ఆ తర్వాత ప్రయాణికులకు కంగారు పడవద్దని చెప్పి దింపేశాడు.

ఆ తర్వాత బస్సు నుండి ఆ పామును కర్రతో బయటకు తీసి వదిలిపెట్టాడు.

ఈ ఘటన కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా కొప్పా తాలూక జయపుర గ్రామంలో జరిగింది.

నేడు జనసేనలోకి బాలినేని .. పవన్ పెట్టిన కండిషన్స్ ఏంటి ?