తెలంగాణలో గత ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం( Telangana Sheep Distribution scheme )లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.ఈ స్కామ్ పై చిత్ర విచిత్రాలను కాగ్ తన నివేదికలో వెల్లడించింది.
ఒకే బైకుపై 126 గొర్రెలు తీసుకొచ్చినట్లు రికార్డులు ఉన్నాయని తెలుస్తోంది.అంతేకాదు అంబులెన్సుల్లో, కారు, బస్సుల్లోనూ గొర్రెలను తీసుకెళ్లినట్లు రికార్డులు ఉన్నాయని కాగ్ నివేదికలో పేర్కొంది.
అలాగే జీవాలను కొనకుండానే కొన్నట్లు చూపడంతో పాటు చనిపోయిన వారికీ గొర్రెలను పంపిణీ చేసినట్లు తెలిపింది.
స్కీమ్ లో భాగంగా పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయినట్లు గుర్తించారు.ఈ క్రమంలోనే సుమరు రూ.253.93 కోట్ల వినియోగంపై అభ్యంతరం వ్యక్తం అవుతుండగా నకిలీ రవాణా ఇన్వాయిస్ లతో రూ.68 కోట్లు స్వాహా అయ్యాయని కాగ్ రిపోర్టులో వెల్లడైంది.దాంతోపాటు గొర్రెలకు నకిలీ ట్యాగ్ లతో మరో 92 కోట్లు స్వాహా అయ్యాయని కాగ్ నివేదికలో వెల్లడించింది.